బాలింత భార్యను కడతేర్చిన భర్త
ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మంలో మరో దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. బిడ్డకి జన్మనిచ్చిన మరుసటి రోజే భార్యకు భర్త మత్తు మందు ఇచ్చి చంపిన వైనమిది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే భార్య చనిపోయిందంటూకుటుంబీకులతో కలిసి భర్త ఆందోళనకు దిగాడు. ప్రైవేట్ ఆస్పత్రి సెటిల్ మెంట్ లో డబ్బులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించాడు. మహిళ మృతి పై అనుమానం వచ్చి, ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించింది. మృతురాలు ప్రసవించిన రోజు భర్తే అర్థరాత్రి భార్యకు అధిక మోతాదులో మత్తు మందు ఇంజక్షన్ ఇచ్చినట్టు గుర్తించింది. 50 రోజుల క్రితం ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఘటన జరిగింది. దాంతో అసుపత్రి యాజమాన్యం ఖమ్మం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిరి అరెస్టు చేసారు.
Tags: A husband who marries a childish wife

