Natyam ad

భార్యను అమ్మేసిన భర్త

భువనేశ్వర్ ముచ్చట్లు:


పిల్లలను సాదలేక అమ్మకానికి పెట్టిన దారుణాలను చూశాం.. చదువు మాన్పించి పనిలో పెట్టిన వైనాలూ చూశాం.. ఇక పెళ్లాలను టార్చర్ పెట్టే మొగుళ్లను చూశాం.. రోజూ తాగొచ్చి భార్యలను కొట్టే వెధవలను కూడా చూశాం.. మందుకు డబ్బులు ఇవ్వకపోతే భార్యలను కడతేర్చిన దుర్మార్గాలనూ చూశాం.. కానీ, వీడు మాత్రం అంతకు మించి అని చెప్పాలి. కష్టపడి పని చేయడం చేతకాక.. మందు తాగేందుకు డబ్బు లేక ఏకంగా భార్యనే వేరే వ్యక్తికి అమ్మేశాడు. ఆపై అతనితో ఆమెకు బలవంతంగా పెళ్లి చేశాడు. ఎలాగోలా ఆ వ్యక్తి చెర నుంచి తప్పించుకున్న మహిళ.. తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దిగ్భ్రాంతికర ఘటన ఒడిశాలోని కలహండి జిల్లా జరగ్గాలో చోటు చేసుకుంది.ఈ ఘటనకు సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జరగ్గా ప్రాంతానికి చెందిన ఖిరా బెరుక్.. పూర్ణిమా భోయ్ ని వివాహం చేసుకున్నాడు. కొంతకాలం సంసారం బాగానే ఉన్నా.. మనోడు ద్యాస అంతా మందుపైనే ఉండేది. రోజూ తాగుతూ ఉండేవాడు. అయితే, కష్టం చేసుకోవడానికి ఒళ్లు బద్దకించింది, మందు తాగడానికి డబ్బులు కరువయ్యాయి. ఇంకేముంది.. తన భార్యను అమ్మేయాలని ఫిక్స్ అయ్యాడు. విషయం ఆమెకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు.

 

 

పని పేరుతో అక్టోబర్ 30న ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లాడు ఖీరా. ఢిల్లీకి వెళ్లిన రెండు రోజుల్లోనే తన భార్యను డబ్బుల కోసం తన భార్యను వేరే వ్యక్తికి విక్రయించాడు. భారీ మొత్తంలో డబ్బులు అందుకున్న తరువాత ఖీరా బెరుక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.అయితే, ఖీరా భార్యను కొనుగోలు చేసిన వ్యక్తి.. ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఆమెను బలవంతంగా తన నిర్బంధంలో ఉంచుకున్నాడు. కొద్దిరోజుల తరువాత నవంబర్ 5వ తేదీన పూర్ణిమ భోయ్ ఎలాగోలా తప్పించుకుని, తన తండ్రి కులమణి భోయ్‌కి ఫోన్ చేసింది. భర్త చేసిన దారుణం గురించి, తాను పడుతున్న కష్టాల గురించి తండ్రికి వివరించింది. కూతురు కష్టాలు విన్న తండ్రి.. వెంటనే నార్ల పీఎస్‌లో పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భర్త ఖిరా బెరుక్‌తో పాటు మహిళను పెళ్లి చేసుకున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలి పూర్ణిమ భోయ్‌ని సేఫ్‌గా స్వస్థలానికి తీసుకువచ్చారు.

 

Post Midle

Tags: A husband who sold his wife

Post Midle

Leave A Reply

Your email address will not be published.