భార్యమీద కోపంతో గొంతుకోసుకున్న భర్త

A husband who was angry with his wife

A husband who was angry with his wife

Date:15/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

భార్య చెప్పినమాట వినకపోవడంతో మనస్థాపానికి గురై బ్లెడ్‌తో గొంతుకోసుకుని రక్తశ్రావంతో భర్త చికిత్స పొందుతున్న సంఘటన శనివారం రాత్రి చోటుకుంది. పట్టణంలోని ప్రకాశం కాలనీలో నివాసం ఉన్న మహేష్‌కుమార్‌(30) కు సానేప్పల్లెకు చెందిన సంపూర్ణతో పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహేష్‌కుమార్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య తరచుగా ఇతరులతో ఫోన్‌లో మాట్లాడుతుండటంతో వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడింది. భార్య పుట్టినింటికి వెళ్లింది.

 

ఇలా ఉండగా పండగ రోజు మహేష్‌కుమార్‌ భార్య వద్దకు వెళ్లాడు. అక్కడ భార్య ఫోన్‌లో మాట్లాడుతుండగా వద్దని చెప్పడంతో బావ మరది నరసింహులు మహేష్‌ను కొట్టడంతో ఇంటికి వచ్చేశాడు. తిరిగి శనివారం రాత్రి భార్య వద్దకు వెళ్లాడు. భార్య ఇతరులతో ఫోన్‌లో మాట్లాడుతుండటంతో ఘర్షణ పడి, మనస్థాపానికి గురై, బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యాహత్యానికి పాల్పడ్డాడు. వెంటనే గ్రామస్తులు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణపాయం లేదని వైద్యులు తెలిపారు.

10 ఆర్టీసీ బస్ ల పై కేసు నమోదు

Tags:A husband who was angry with his wife

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *