ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలక అడుగు  కోల్‌కతా బయల్దేరి వెళ్ళిన ముఖ్య మంత్రి కెసిఆర్      పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తో భేటి

A key step in the formation of the Federal Front Chief Minister KCR who went to Kolkata The West Bengal CM met with Mamata Banerjee

A key step in the formation of the Federal Front Chief Minister KCR who went to Kolkata The West Bengal CM met with Mamata Banerjee

Date:19/03/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్రంట్ థర్డ్ మరోసారి తిరపైకి రావడం తో తెలంగాణా ముఖ్య మంత్రి కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలక అడుగు ముందు పడింది. దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మొదటగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసేందుకు సీఎం కేసీఆర్.. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కోల్‌కతా బయల్దేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు, ఎంపీలు కవిత, జితేందర్‌రెడ్డి, రాజ్యసభ అభ్యర్థి సంతోష్ కుమార్ ఉన్నారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో కోల్‌కతా చేరుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్‌పోర్టులో సీఎం కేసీఆర్‌కు.. పశ్చిమ బెంగాల్ వ్యవసాయ శాఖ మంత్రి పూర్ణేంద్ బస్‌తో పాటు పలువురు ప్రముఖులు స్వాగతం పలికారు. మధ్యాహ్నం3.15 గంటలకు మమతా బెనర్జీతో సీఎం సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, ఎజెండా, ఇతర విషయాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు. దాదాపుగా రెండు గంటలకు పైగా సమావేశం జరుగుతుందని భావిస్తున్నారు.  ఈ భేటీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి ప్రసిద్ధ కాళీమాత ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొంటారు. రాత్రి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.
Tags:A key step in the formation of the Federal Front
Chief Minister KCR who went to Kolkata
The West Bengal CM met with Mamata Banerjee

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *