Natyam ad

మిస్టరీగా మారిన కిడ్నాప్

ఉయ్యూరు ముచ్చట్లు:


ప్రశాంతంగా ఉండే పల్లెటూరు లో బాలుడి అదృశ్యం తల్లితండ్రులను  శోక సంద్రంలో ముంచటమే కాకుండా గ్రామస్తులను కలవరానికి గురిచేస్తుంది. ఉయ్యూరు మండలం కడవకల్లు గ్రామానికి చెందిన 13 సంవత్సరాల ప్రభు కుమార్ అదృశ్యం మిస్టరీగా మారింది. ఈ బాలుడిని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా ఏదైనా ప్రమాదం జరిగిందా అనే సమాచారం తెలియక తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణం నాతీతం. మాగంటి సురేష్ బాబు శోభారాణిల రెండో కుమారుడు ప్రభు కుమార్ ఉయ్యూరు విశ్వశాంతి స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈనెల 16వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ఆడుకోవడానికి బయటకు వెళ్లిన ప్రభు కుమార్ మరలా ఇంటికి తిరిగి రాలేదు. మధ్యాహ్నం భోజనానికి రాకపోవడంతో ఆందోళన  చెందిన తల్లిదండ్రులు ప్రభు కుమార్ గురించి ఆరా తీయడం మొదలెట్టారు అయితే ప్రభు కుమార్ జడ కనిపించకపోవడంతో పాటు ఎవరు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన ఉయ్యూరు రూరల్ పోలీసులు వివిధ కోణాల్లో పరిశోధించారు కానీ ఫలితం లేదు. నాలుగు రోజులు గడుస్తున్న బాలుడి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు తమ కుమారుడికి ఏమైనా ప్రమాదం జరిగి ఉంటుందేమోనని కన్నీరు మున్నీరవుతున్నారు.

 

 

అయితే గ్రామంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు చూడని గ్రామస్తులు సైతం భయాందోళన చెందుతున్నారు. ప్రభు కుమార్ ని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా ఏదైనా ప్రమాదం జరిగిందా అనే విషయం కూడా తెలియడం లేదు. యధావిధిగా ఒకటి రెండు రోజులు హడావుడి చేసిన పోలీసులు ఈ కేసు పై క్రమంగా ఆసక్తి చూపటం లేదు. తల్లిదండ్రులు గ్రామస్తులు బాలుడి  ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు తీవ్రంగా గాలిస్తున్న ఫలితం లేకుండా పోతుంది. పోలీస్ అధికారులు   విస్తృతంగా గాలింపు చర్యలు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తూ నిమగ్నమయ్యారు   అధికారులు స్పందించి విచారణ వేగవంతం చేసి ఆ తల్లితండ్రుల గర్భ సోకాన్ని తీర్చాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

 

Post Midle

Tags: A kidnapping that turns into a mystery

Post Midle