అమ్మ ఒడికి పెద్ద ఎత్తున నిధులు

Date:12/07/2019

విజయవాడ ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి పథకానికి ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. ‘జగనన్న అమ్మఒడి’ పథకంగా పిలవబడే ఈ స్కీమ్ నవరత్నాల్లో కీలకమైనది. పిల్లలకు బడికి పంపే ప్రతి అమ్మ బ్యాంక్ అకౌంట్లో సంవత్సరానికి రూ.15వేలు వేస్తామని జగన్ ఇచ్చిన హామీ మహిళలను విశేషంగా ఆకట్టుకుంది.

 

 

 

డబ్బులు లేక ఓ ఒక్క చిన్నారి చదువుకు దూరం కాకూడదన్న ఆలోచనతోనే ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. బిడ్డలను పాఠశాలలకు పంపే ప్రతి తల్లికి ఈ పథకం కింద రూ.15వేలు అకౌంట్లో జమ చేస్తామన్నారు. ఈ పథకాన్ని ముందుగా 1-10 తరగతుల విద్యార్థులకు ప్రవేశపెట్టినా.. ఇంటర్ వరకు వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దీని ద్వారా 43మంది లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

 

 

 

 

ఈ స్కీమ్‌కు ముఖ్యమంత్రి జగన్ పేరు పెట్టేందుకు ఆయన్ని చాలా ఒప్పించాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. ఎన్నికల్లో వైసీపీ కనీవినీ ఎరుగని విజయాన్ని సాధించడం వెనుక ‘అమ్మఒడి’ పథకం పాత్ర ఎంతో ఉంది. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క చిన్నారి బడికి దూరం కాకూడదన్న ఆశయంతో జగన్ ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఆయన ఆశయానికి అనుగుణంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి ప్రస్తుతం బడ్జెట్లలో ఈ పథకానికి ఏకంగా రూ.6,455.80కోట్లు కేటాయించారు.

 

 

విద్యా రంగానికి సంబంధించి కేటాయింపులిలా..
⇨ విద్యాశాఖ: రూ.32,681.46 కోట్లు
⇨ ఉన్నత విద్య: రూ.3021.63 కోట్లు
⇨ మాధ్యమిక విద్య: రూ.29,772.79 కోట్లు
⇨ జగన్ అన్న విద్యా దీవెన పథకం: రూ.4962 కోట్లు
⇨ వైద్య ఆరోగ్యం: రూ.11399.23 కోట్లు
⇨ మధ్యాహ్న భోజన పథకానికి రూ.1077 కోట్లు.

టార్గెట్ బాబుగా అడుగులు

Tags: A large amount of funding for Mother Odi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *