న్యాయవాదులకు రక్షణ చట్టం చేయాలి
-న్యాయవాది మల్లారెడ్డి హత్యను నిరసిస్తూ విధులు బహిష్కరించిన న్యాయవాదులు
మంథని ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులకు రక్షణ చట్టం చేయాలని మంథని బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరిబాబు , ప్రధాన కార్యదర్శి చందుపట్ల రమణ కుమార్ రెడ్డి లు డిమాండ్ చేశారు. వరంగల్ బార్ అసోసియేషన్ సభ్యుడు, న్యాయవాది మల్లారెడ్డి హత్యను నిరసిస్తూ మంథని కోర్ట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి, నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షలు హరిబాబు , ప్రధాన కార్యదర్శి చందుపట్ల రమణ కుమార్ రెడ్డి లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత న్యాయవాదులపై హత్యలు పెరిగాయని , సంవత్సరం క్రితం గట్టు వామన్ రావు దంపతుల హత్య మరవక ముందే, ములుగు జిల్లాలో న్యాయవాదిని హత్య చేయడం హేమమైన చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రఘోత్తమ రెడ్డి, ట్రెజరర్ బొట్ల ఆంజనేయులు, కార్యదర్శి విజయ్, సీనియర్ న్యాయవాదులు , భాస్కర్ రెడ్డి, లోకె రాధా కిషన్, వెంకట్రాంరెడ్డి, న్యాయవాదులు సుభాష్, వసుంధర్, సదన్ , కార్యవర్గ సభ్యులు ఆర్ల నాగరాజు లు పాల్గొన్నారు.

Tags: A law should be made to protect lawyers
