Natyam ad

ప్రజల గుండెల్లో నిలిచిన నేత రంగా

రాజోలు ముచ్చట్లు:

ప్రజల గుండెల్లో వంగవీటి మోహనరంగ చిర స్థాయిగా నిలిచారని రంగా తనయుడు వంగవీటి రాధ అన్నారు. రాజోలులో గాంధీబొమ్మ సెంటర్‌లో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ మనిషి ఒక కులంలో పుడతాడని, ప్రజల కోసం పోరాడే వాడే ప్రజా నాయకుడవుతాడ న్నారు. ఒక అధ్యయనాన్ని సృష్టించిన నాయకుడు వంగవీటి మోహనరంగా అని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మారుమూల గ్రామంలో పుట్టిన రంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. పుట్టిన కులాన్ని కొంత మంది తిడుతున్నారని, అటువంటి వారికి మీరే బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్ర మంలో మెట్ల రమణబాబు, బొర్రా చిట్టిబాబు, కరాటం ప్రవీణ్‌, గంధం పల్లం రాజు, పామర్తి రమణ, తాటిపాక ఉపసర్పంచ్‌ కటికిరెడ్డి బుజ్జి, రాజోలు సర్పంచ్‌ రేవు జ్యోతి, హరి, రమేష్‌, రాజు పాల్గొన్నారు.

 

Tags: A leader in the hearts of people

Post Midle
Post Midle