Natyam ad

మైనర్ విద్యార్థినిని పెళ్లి చేసుకున్న లెక్చరర్

ఫోక్సో కేసు నమోదు చేసిన గంగవరం పోలీసులు

 

చిత్తూరు  ముచ్చట్లు:

పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువే.. తప్పుడు మార్గం పట్టాడు. కామాంధుడిగా మారి..ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి బలవంతపు పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అతడికి పెళ్లయి, ఓ కుమార్తె కూడా ఉంది. అధ్యాపక వృత్తికే కళంకం తీసుకొచ్చిన ఆ ప్రబుద్ధుడి గురించి పోలీసులు తెలిపిన ప్రకారం.. గంగవరం మండలానికి చెందిన చలపతి (33) శ్రీ వాణి కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే 17 ఏళ్ల విద్యార్థినితో చనువుగా ఉంటూ వచ్చాడు. మాయమాటలు చెప్పాడు. బుధవారం రోజున చివరి పరీక్ష రాసి బయటకు వస్తున్న ఆ విద్యార్థినిని నమ్మించి తిరుపతికి తీసుకెళ్ళాడు.

 

తాను నిజాయితీపరుడని, తనను నమ్మితే సంతోషంగా చూసుకుంటానని మాయమాటలు చెప్పాడు. అక్కడే ఓ ఆలయంలో పెళ్లికూడా చేసుకున్నాడు. కొద్దిసేపటికి లెక్చరర్ చలపతి నిజస్వరూపాన్ని ఆమె గమనించింది. అతడి మాటలకు పొంతన లేకపోవడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి గురువారం రాత్రి గంగవరం పోలిస్ స్టేషన్కు చేరుకొంది. లెక్చరర్ మాయమాటలు చెప్పి మోసంచేశాడని తల్లిదండ్రుల వద్ద విలపించింది. బాలికతోపాటు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ లెక్చరరు చలపతిపై ఎస్ఐ సుధాకర్ రెడ్డి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి చేసి కోర్టుకు హాజరు పరచినట్లు ఎస్ఐ తెలిపారు.

Tags;