50 రోజులకే పరిమితమైన ఉపాధి హామీ

Date:16/03/2018
నిజామాబాద్ ముచ్చట్లు:
 2017 2018 ఆర్థిక సం వత్సరం ముగింపునకు మరో 16 రోజులు మాత్ర మే మిగిలి ఉన్నాయి. పేదకుటుంబాలకు గ్రామాల్లోనే ఉపాధి కల్పించి వలసలను నిరోధించేందు కు యుపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధిహామీ పథకం అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలో పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఉపాధిహామీ చట్టం ప్రకారం జాబ్‌కార్డు కలిగిన కుటుంబాలకు ఒక ఆర్థిక సంవత్సరంలో తప్పని సరిగా 100 రోజులు పని కల్పించాల్సిన బాధ్యత ఉపాధిహామీ అధికారులపై ఉంది. పని అడిగిన ప్ర తి కూలీకి దరఖాస్తు చేసుకొన్న 15 రోజుల్లోపు ప ని చూపించాల్సిన బాధ్యత జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులపై ఉంది. పనులు చూపించకుం టే నిరుద్యోగభృతి కింద కూలీకి కూలిలో సగం చె ల్లించాలని చట్టంలో పొందుపరిచడమైనది. పర్మినెంట్, టెంపరరీ, వికలాంగుల శ్రమశక్తి సంఘాలను కలుపుకొని జిల్లాలో 17,571 ఉన్నాయి. వీ టిలో 2.40 లక్షల 203 మంది కూలీలు సంఘా ల్లో నమోదై ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరం ప్ర కారం జిల్లాలో కూలీలకు, మెటీరియల్ ఖర్చుల కింద రూ.114 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా మార్చి 14 నాటికి కేవలం 54.77 కోట్లు మాత్ర మే ఖర్చు చేశారు.పని అడిగిన ప్రతి కూలీకి పని కల్పించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జిల్లాలో ఉపాధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. గత ఏడు అధికారు లు తయారు చేసిన నివేదిక ప్రకారం 2017 – 2018 సంవత్సరానికి జిల్లాలో ఉపాధి పనులకు వచ్చే కూలీల వేతనాలకు గాను రూ.114 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు రూ.54.77 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.మరో 15 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగిసి పోనుండడంతో మిగిలిన రూ. 60 కోట్ల ఖర్చుపై నీలినీడలు కమ్ముకున్నా యి. జిల్లాలోని 21 మండలాల్లో 323 గ్రామపంచాయతీలు ఉండగా వాటి పరిధిలో 636 ఆమ్లెట్ గ్రామాలు, 2లక్షల 14వేల 116 జాబ్‌కార్డులు ఉ న్నాయి. 5లక్షల 11వేల 902 మంది కూలీలు జాబ్‌కార్డుల్లో నమోదై ఉన్నారు. 17571 శ్రమశక్తి సంఘాలు ఉండగా 3లక్షల 21వేల 200 మంది కూలీలు సంఘాల్లో నమోదై ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం లక్షా 25వేల 210 జాబ్‌కార్డులు కలిగిన వారు పనులు చేపట్టగా అందులోని 2లక్షల 40వేల 230 మంది కూలీలు ఉపాధి పనులకు వ చ్చారు. జిల్లాలో 1.20 లక్షల 374 కుటుంబాలకు వంద రోజులు కల్పించాల్సి ఉండగా ఇప్పటి వర కు జిల్లాలో 11709 కుటుంబాలు మాత్రమే 100 రోజుల పనిని కల్పించారు. ఓవరాల్‌గా జి ల్లాలో ఒక కుటుంబానికి 50 పని దినాలు మాత్ర మే కల్పించారు. మిగిలిన 50 రోజుల పనిదినాలు మరో పదిహేను రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంది.మరో రూ.60 కోట్ల నిధులు ఈ నెలాఖారు వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. జి ల్లాలో అధికారుల, ఉపాధి సిబ్బంది నిర్లక్ష్యంతో ఉపాధి పనులు నత్తనడకన కొనసాగున్నాయి. కో టీ 25 లక్షలకుపైగా పనిధినాలు కల్పించాల్సిన అ ధికారులు 62.52 లక్షల పనిదినాలు మాత్రమే కల్పించి చేతులు దులుపుకున్నారు. జిల్లాలో ఓవరాల్‌గా ఒక్కో జాబ్‌కార్డు కలిగిన కుటుంబానికి 50 రోజులు మాత్రమే పని కల్పించారు. ప్రతీ సంవత్సరం జనవరి నుంచి మార్చి వరకు ప్రతీ గ్రామంలో ఉపాధి పనులు జోరుగా కొనసాగుతుండేవి. ఈ ఏడు పనులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో గ్రామాల్లో ఉపాధి పనులు నత్తనడకనా కొనసాగుతున్నాయి.జాబ్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ వంద రోజులు ఉపాధి పనులు కల్పించాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలో ఉపాధి పనులు ఆశించిన మే ర కల్పించలేదు. జిల్లాలో ఓవరాల్‌గా 50 శాతం మాత్రమే పని దినాలు కల్పించారు. జిల్లాలో అ త్యధికంగా పని దినాలు కల్పించిన మండలం బి చ్కుంద కాగా అత్యల్పంగా పనిదినాలు కల్పించి మండలం బాన్సువాడ ఉంది. మండలాల వారీ గా కల్పించిన పనిదినాలు బాన్సువాడ 43.37 శా తం, భిక్కనూరు 49.12 శాతం, బిచ్కుంద, పెద్దకొడప్‌గల్ మండలాల్లో 57.85 శాతం, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో 53.28 శాతం, దోమకొండ, రాజంపేట్ మండలాల్లో 46.97 శాతం, గాంధారి 52.77శాతం, జుక్కల్ 52.91 శాతం, కామారెడ్డి 50.65 శాతం, లింగంపేట్ 45.56 శాతం, మాచారెడ్డి 52.85 శాతం, మద్నూర్ 49.34 శాతం, నాగిరెడ్డిపేట్ 51.28 శాతం, ని జాంసాగర్ 47.56 శాతం, పిట్లం 57.79 శాతం, సదాశివ్‌నగర్, రామారెడ్డి మండలాల్లో 40.15 శాతం, తాడ్వాయి 45.15 శాతం, ఎల్లారెడ్డి 46.21 శాతం మాత్రమే పనులు కల్పించారు.ఉపాధిహామీ పథకంలో కూలీలకు కల్పించి పనిదినాలను బట్టి మెటీరియల్ ఖర్చులకు నిధులు కేటాయిస్తారు. కూలీలకు చెల్లించిన వేతనాల్లో 40 శా తం మెటీరియల్ ఖర్చులకు నిధులు మంజూరు చేస్తారు. 60 శాతం కూలీల ఖర్చులకు, 40 శాతం మెటీరియల్ ఖర్చులకు కేటాయిస్తారు. కూలీలకు పని కల్పించకపోవడంతో కూలీల వేతనాల ఖర్చు తగ్గిపోవడంతో మెటీరియల్ ఖర్చులకు వచ్చే నిధు లు సైతం తగ్గిపోనున్నాయి. ఈ ఆర్థికం సంవత్స రం కింద జిల్లాలో 114 కోట్లు నిధులు కేటాయించగా ఇప్పటి వరకు కేవలం రూ.54.77 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కూలీల చెల్లించిన వేత నం ప్రకారం 40 శాతం మెటీరియల్ ఖర్చుల కిం ద మంజూరయ్యే నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, గ్రామపంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు నిధులు ఖర్చు చేస్తారు. కూలీలకు ప నులు కల్పించకపోవడంతో మెటీరియల్ నిధులు సైతం తగ్గిపోనున్నాయి.ఉపాధిహామీ పథకంలో ముఖ్యంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీలు, వికలాంగులకు ఉపాధి కల్పించేలా చట్టం రూపొందించారు. గ్రామాల్లో పనులు లేక పట్టణాలకు వలసవెళ్లి ఇబ్బందులు పడకుండా ఉండేలా ఉపాధిహామీ పథకంలో వెనుబడిన కు లాల కూలీలకు తప్పని సరిగా పనులు కల్పించా ల్సి ఉంది. 2017 – 2018 ఆర్థిక సంవత్సరానికి గాను చేసిన పనుల్లో ఎస్సీలు 21.21 శాతం, ఎస్టీ లు 13.11 శాతం, బీసీలు 57.87 శాతం, మైనార్టీలకు 2.25 శాతం, ఇతరులకు 5.55 శాతం మంది ఉపాధి పనుల్లో పాల్గొన్నారు.
Tags: A limited employment guarantee is limited to 50 days

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *