Natyam ad

లిక్కర్ స్కామ్-బిగిస్తున్న ఉచ్చు

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌  కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. లిక్కర్‌ పాలసీ కార్యకలాపాల కోసం స్పెషల్ ఫ్లైట్స్‌ బుక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. జోనా ట్రావెల్స్ వివరాల ఆధారంగా ఫ్లైట్స్‌ వెళ్లి నట్లు నిర్ధారించారు. జోనా ట్రావెల్స్‌ను రమాసింగ్‌ లీడ్ చేస్తున్నట్లు గుర్తించారు. లిక్క‌ర్ పాల‌సీ కార్య‌ క‌లాపాల కోసం ప్ర‌త్యేక విమానాల‌ను బుక్చేసిన‌ట్లు అధికారులు గుర్తించారు అందుకు సంబంధించి జోనాట్రావెల్స్వ‌ద్ద స్వాధీనం చేసుకున్న‌ వివరాల ఆధారంగానే ఈ సంగ‌తి బ‌య‌ట‌ ప‌డింది. పంజాబ్ ఎన్నికల సమయంలో ఢిల్లీ పార్టీ నేతలకు 200 కోట్లు ఇచ్చినట్టు, శ్రీనివాస్ రావు ద్వారానే లావా దేవీలు జరిగినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. 200 కోట్లు లావాదేవీల పైన శ్రీనివాస్ రావును  ఈడీ ప్రశ్నించింది. లిక్కర్ టెండర్ల కోసం చెల్లించారా లేదా మరో దానికా అనే కోణంలో దర్యాప్తును ఈడీ కొనసా గిస్తోంది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్ప‌టికే అరుణ్ రామచంద్ర పిళ్ళై, గోరుంట్ల బుచ్చి బాబు (సీఏ), అభినవ్ రెడ్డి, అభిషేక్ రావు, గండ్ర సృజన్ లను విచారించిన ఈడీ.. వీరు ఇచ్చిన సమాచారం మేరకు సోమ వారం ఆరు చోట్ల సోదాలు  నిర్వహించింది. సుచిత్రా, కొండాపూర్ లోని రెండు నివాసాలలో, మాదాపూర్ వార్సన్ సాఫ్ట్ వేర్ సంస్థ, ఉప్పల్ లోని సాలిగ్రామ్ టెక్నాలజీలో ఈడీ సోదాలు నిర్వహించింది. బిల్డర్ శ్రీనివాస్ ఇంట్లో సోదాలు చేసి అతన్ని అదుపులోకి తీసుకొని సుమారు ఆరు గంటల పాటు ఈడీ అధికారులు విచా రించి అతని స్టేట్ మెంట్ నమోదు చేసుకున్నారు. శ్రీనివాస్ రావు ఇచ్చిన సమాచారం మేరకు మరికొంత మందినిసైతం విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవు తున్నారు.ఈడీ అధికారులు నిన్న సుదీర్ఘంగా 7 గంటలపాటు శ్రీనివాసరావును విచారించి అతని స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఆయన ఇంట్లో సోదాలు చేసిన తర్వాత కీలక పత్రాలతోపాటు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకు న్నారు.

 

 

Post Midle

వివిధ కన్నాల్టెన్సీలు, కంపెనీల్లో సోదాలు చేసి వాటిని సీజ్ చేశారు. మంగళవారం మరికొంత మందికి నోటీసులు జారీ చేయడం, మరికొన్ని కంపెనీలు, కార్యాలయాల్లో సోదాలు చేసే అవకాశముంది. ఇప్పటివరకు దాదాపు నాలుగుదఫాలుగా 23 బృందాలు.. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూ రు లో సోదాలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఉన్న కంపెనీలకు.. హైదరాబాద్‌లోని పలు కంపెనీలు, అలాగే శ్రీనివాసరావు కు చెందిన కంపెనీల నుంచే ముడుపులు వెళ్లినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. శ్రీనివాసరావు ద్వారానే కోట్లలో లావాదేవీలు జరిగినట్లు నిర్దారించారు. కంపెనీల ఏర్పాటుకు సంబంధించి కీలక పత్రాలు స్వాధీ నం చేసుకున్నారు. పిళ్ళై, శ్రీనివాసరావు మధ్య సంభాషణలను ఈడీ అధికారులు రిట్రైవ్ చేశారు. ఆ ఇద్దరి నుంచి అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు సమాచారంకాగా ఈడీ అధికారుల సోదాల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. పంజాబ్ ఎన్నికల్లో ఢిల్లీ నేతలకు రూ. 200కోట్లు ఇచ్చినట్లు ఆధారాలు సేకరించారు. శ్రీనివాసరావు ద్వారానే కోట్లలో లావాదేవీలు జరిగి నట్లు గుర్తించారు. రూ.200 కోట్ల లావాదేవీలపై శ్రీనివాసరావును అధికారులు ప్రశ్నించారు. లిక్కర్ టెండ ర్ల కోసం చెల్లించారా? లేదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలోని తొమ్మిది  లిక్కర్ కంపెనీలతో హైదరాబాద్ వ్యాపారవేత్తలకు లింకులు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ డబ్బు ఎవరి ఖాతా నుంచి వెళ్లిందనే అంశం పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags: A liquor scam-setting trap

Post Midle