Natyam ad

కారును ఢీకొన్న లారీ..ముగ్గురు దుర్మరణం

కర్నూలు ముచ్చట్లు:


కర్నూలు నగర శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పై వెళ్తున్న కారును లారీ ఢీకొనింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతులు అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన గనేశ్, రుద్ర, సోమ శేఖర్ గా గుర్తించారు. వీరు కర్నూలులోని తుంగభద్ర హోటల్ లో పని చేస్తున్నట్లు సమాచారం. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారును ఢీకొని పరారైన లారీ కోసం గాలిస్తున్నామని  తాలుకా సిఐ శేషయ్య తెలిపారు.

 

Tags: A lorry collided with a car..three people died

Post Midle
Post Midle