గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లిన లారీ

లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరు మృతి

 

కడప ముచ్చట్లు:

బెంగుళూరు నుంచి గుంటూరుకు వెళ్తుండగా ప్రమాదం కడప శివారులోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో లారీ అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరు మృతి చెందారు. పోలీసులు వివరాల మేరకు.. బెంగళూరు నుంచి గుంటూరుకు రొయ్యల దాణా బస్తాలు తీసుకెళ్తున్న లారీ రాత్రి 10 గంటలకు గువ్వల చెరువుకు చేరింది. ఘాట్ రోడ్లోని నాలుగో మలుపు వద్దకు రాగానే.. లారీ అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. దాదాపు వంద అడుగుల లోతులోకి లారీ దూసుకెళ్లడంతో.. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్యాబిన్లో చిక్కుకున్న క్లీనర్ను అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. లారీ నుంచి అతికష్టం మీద మృతదేహాన్ని పోలీసులు పైకి తీసుకొచ్చారు.

 

Post Midle

Tags: A lorry lost control and plunged into a valley on Guwwala Pond Ghat Road

Post Midle
Natyam ad