Natyam ad

వైభవంగా గిరిప్రదర్శన

ఇంద్రకీలాద్రి ముచ్చట్లు:

పౌర్ణమి సందర్భముగా ఉదయం లోకకళ్యాణార్థం, భక్త జనశ్రేయస్సు కొరకు మరియు ధర్మప్రచారం నిమిత్తం వేదపండితుల మంత్రోచ్చరణలు, అమ్మవారి నామ స్మరణలు,  మంగళ వాయిద్యముల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం(ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద) వద్ద శ్రీ స్వామి, అమ్మవార్లుకు ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తముగా పూజలు నిర్విహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు,  కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ,  ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు కొబ్బరి కాయ కొట్టి కార్యక్రమంను ప్రారంభించారు.
గిరిప్రదక్షిణ కార్యక్రమము శ్రీ కామధేను అమ్మవారి ఆలయము, కుమ్మరిపాలెం సెంటర్, నాలుగు స్థంబాల సెంటర్, సితార, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టి నగర్, కొత్తపేట, నెహ్రు బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా  ఆలయమునకు చేరుకున్నారు.  గిరిప్రదక్షిణ మార్గము నందు భక్తులు ప్రచార రథము లో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు, స్వామి వార్లకు భక్తిశ్రద్దలతో పూలు, పండ్లు, కొబ్బరికాయ లు సమర్పించి, పూజలు చేసి, అమ్మవారిని, స్వామి వారిని ప్రార్థించి, అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే  గిరి ప్రదక్షిణ  చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి.

 

 

అనంతరం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్  మాట్లాడుతూ పౌర్ణమి సందర్బంగా గిరిప్రదక్షిణ ప్రారంభించినప్పటి నుండి ఈరోజు 5 వ సారి గిరిప్రదక్షిణ అని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, సంక్షేమం కొరకు పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించడం జరిగినదని, గిరి ప్రదక్షిణలో పాల్గొనడం అందరికీ సంతోషంగా ఉన్నదని తెలిపారు. రాబోవు గిరి ప్రదక్షిణల యందు భక్తులు మరింతగా పాల్గొని శ్రీ అమ్మవారి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరి ఉన్నారు.

 

 

Post Midle

అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఉదయం నుండి భక్తులు గిరిప్రదక్షిణ యందు పాల్గొనటం జరిగినదని, ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభించినప్పటి 5 వ సారి ఈరోజు నిర్వహించడం జరిగినదని, గిరి ప్రదక్షిణ కార్యక్రమం నందు భక్తులు ప్రతి నెల విశేషంగా పాల్గొంటున్నారని, రాబోవు గిరి ప్రదక్షిణల యందు భక్తులు మరింతగా పాల్గొని శ్రీ అమ్మవారి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరి ఉన్నారు.
ఈ కార్యక్రమం నందు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు బుద్దా రాంబాబు, చింకా శ్రీనివాస రావు, బచ్చు మాధవీకృష్ణ,  ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మవైదిక సిబ్బంది, వేద పండితులు, కార్యనిర్వాహక ఇంజినీర్ ఎల్ రమాదేవి, సహాయ కార్యనిర్వాహణాధికారి ఎన్ రమేష్, అర్చకులు, ఆలయ అధికారులు, సిబ్బంది, పోలీస్ శాఖ వారు మరియు భక్తులు విశేషముగా పాల్గొన్నారు.

 

Tags; A magnificent display

Post Midle