చంద్రగిరి పోలీస్ స్టేషన్ దగ్గర వ్యక్తి ఆత్మహత్యాయత్నం
చంద్రగిరి ముచ్చట్లు:
చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట సోమవారం పెట్రోల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. విజయవాడకు చెందిన మణికంఠకు దుర్గాతో వివాహం జరిగింది. కొన్ని రోజులుగా భార్యా భర్తల మధ్య వివాదం నడుస్తోంది. భార్య దుర్గా కాపురానికి రాలేదని ఆవేదనతో పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని మణికంఠ నిప్పు అంటించుకున్నాడు. పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Tags: A man attempted suicide near Chandragiri police station
