కడప ముచ్చట్లు:
కడపజిల్లాలో పాఠశాల గేటుకు ఉరేసుకుని వ్యక్తి మృతి చెందాడు. అట్లూరు మండలం కోనరాజుపల్లె పాఠశాల గేటుకు ఉరేసుకుని గంపల చిన్న ఎల్లయ్య (37) మృతి చెందాడు. ఎల్లయ్య మృతి పై స్థానికులు, కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎల్లయ్య మృతికి ఆర్ధిక కారణాలని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Tags: A man committed suicide by hanging himself at the school gate