అద్దె ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
నెల్లూరు ముచ్చట్లు:
అద్దే ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. తుమ్మలపెంట రోడ్డు ఆముదాల దిన్నె పెట్రోల్ బంక్ వద్ద ఘటన చోటు చేసుకుంది. అయ్యప్ప దీక్షలో ఉన్న ఇద్దరు స్వాములు భజన నిమిత్తం వెళ్తుండగా వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వారిని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కొల్లదిన్నె గ్రామానికి చెందిన జంపని నారాయణ మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం స్థానికులు కావలి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
Tags: A man died after being hit by a rented RTC bus

