బైకు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

పెద్దతిప్ప సముద్రం ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గం లోని పిటిఎం మండలంలో ఆదివారం రాత్రి రంగసముద్రం వద్ద బైకు అదుపు తప్పి పడ్డ ప్రమాదంలో గాయపడిన భవన కార్మికుడు మృతి చెందినట్లు ఎస్సై రవీంద్ర బాబు తెలిపారు. కర్ణాటకలోని
రాయల్పాడు సమీపాన ఉండే రోనూరుకు చెందిన బీరప్ప(36)
బి. కొత్తకోటలో అద్దెకు ఉంటూ స్థానికంగా భవన నిర్మాణం
పనులు చేస్తున్నాడు. పీటీఎం నాగన్న కోటకు పనికి వెళ్లి, సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా, రంగసముద్రం వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికి సైడు ఇవ్వబోయి బైక్ అదుపుతప్పి పడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు బాదితున్ని చికిత్స కోసం తిరుపతికి తీసుకు వెళ్లారు. అక్కడ బీరప్ప మృతి చెందాడు. పీటీఎం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags:A man injured in a bike accident died

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *