Natyam ad

పుంగనూరులో క్షయవ్యాధి నిర్మూలనపై మానవహారం

పుంగనూరు ముచ్చట్లు:

క్షయవ్యాధిని నిర్మూలించాలని , దీనిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రంజిత పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని తూర్పువెహోగశాలలో గల వైఎస్సార్‌ అర్భన్‌హెల్త్ సెంటర్‌లో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మానహారం పాటించి క్షయవ్యాధిని అంతం చేద్దాం..అంటు నినాదాలు చేశారు. డాక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు రెండు వారాలకు మించి దగ్గు ఉండటం, బరువు తగ్గడం, సాయంత్రంవేళ జ్వరం రావడం లక్షణాలు కలిగి ఉంటే క్షయవ్యాధి పరీక్షలు చేసుకోవాలన్నారు. క్షుయవ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ప్రతి నెల రూ.500లు ఆర్థిక సహాయం అందించడమే కాకుండ పరీక్షలు, చికిత్సలు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఈ విషయాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కోరారు.

Post Midle

Tags: A manslaughter on the eradication of tuberculosis in Punganur

 

Post Midle