సముద్రంలో వివాహిత గల్లంతు

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖ ఆర్కే బీచ్ వద్ద నిన్న గల్లంతు అయిన వివాహిత సాయి ప్రియ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నా యి. పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాసుతో కలిసి సాయి ప్రియ నిన్న ఆర్కే బీచ్ కు వెళ్లారు. సాయంత్రం 6 గంటల వరకు బీచ్ ఒడ్డున భార్యాభర్తలు కలసి ఉన్నారు. అయితే సాయి ప్రియ భర్తకి ఫోన్ లో మెసేజ్ రావడంతో వెనక్కొచ్చి మెసేజ్ చూసుకొని తిరిగి చూసేసరికి సాయి ప్రియ కనబడలేదు. బీచ్ లో కెరటాలకు కొట్టుకుపోయిందని భావించి పోలీసులకు పిర్యాదు చేశారు. భార్య కొట్టుకుపోవడం తాను చూడలేదని భర్త శ్రీనివాసు అంటున్నారు. మెసేజ్ చూసి వచ్చే సరికి సాయి ప్రియ కనబడలేదని చెబతున్నారు. గజ ఈతగాళ్ళు సాయంతో బీచ్ లో గాలించగా ఆచుకీ లభ్యం కాలేదు.అయితే, సాయి ప్రియ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వివాహిత అదృశ్యంపై పలు అనుమానాలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు. అసలు బీచ్ లో కొట్టుకుపోయిందా? లేదా మరేదన్న జరిగిందా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

 

Tags: A married galanthu in the sea

Leave A Reply

Your email address will not be published.