-ఈవ్ టీచింగ్ ఏ కారణమా?
– విద్యార్థి తండ్రి ఆరోపణ
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరులోని ఒక ప్రైవేట్ మెడికల్ కళాశాలలో డెంటల్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ప్రదీప్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు… ఐదు అంతస్తుల కాలేజీ హాస్టల్ భవనం నుండి దూకి సోమవారం అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.. సీనియర్ విద్యార్థుల ఈవ్ టీచింగ్ కారణమని తన తండ్రి అయిన నారాయణకు మెసేజ్ పంపారు.. నారాయణ మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులు కొందరు లైంగిక పరమైన వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు… వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు… తాడిపత్రి కాలేజీ గ్రౌండ్ లో క్రీడలు ఆడుతూ అందరికీ చిరపరిచేతుడైన ప్రదీప్ కుమార్ మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.
Tags;A medical student from Tadipatri committed suicide