పుంగనూరులో 3న బ్రాహ్మణుల సమావేశం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని శ్రీహరిహర బ్రాహ్మణ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కార్తీకవనభోజనాలు నిర్వహిస్తున్నారు. ఈ సంద ర్భంగా సంఘ అధ్యక్షుడు రాజేష్‌ మాట్లాడుతూ మండలంలోని గుడిసెబండ లో కార్తీకమాస పూజలు, వనభోజన కార్యక్రమాలు యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణులు కుటుంబ సమేతంగా హాజరై, పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు శివకుమార్‌, మధుకుమార్‌శర్మ, రామమూర్తి, మహేష్‌, గిరి, హర్ష, వినోద్‌, సత్యసాయి, వేణు, సందీప్‌,పవన్‌, అశ్వర్థనారాయణరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:A meeting of Brahmins at Punganur on 3rd

Post Midle