మైనర్ బాలికను గర్భవతిని చేసిన వృద్దుడు

   Date:15/03/2019
  కర్నూలు ముచ్చట్లు:
కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం యం  ఉప్పలూరు గ్రామం లో దారుణం జరిగింది. పదహారేళ్ళ  బాలికను గర్భవతిని చేసిన  వృద్ధుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. గొర్రెలు కాసెందుకు బాధిత బాలికను తీసుకెళ్లిని జింకల పుల్లయ్య సంవత్సర కాలంగా అఘాయిత్యానికి పాల్పడ్డని పోలీసులు నిర్దారించారు. బాలికకు నిందితుడు  వరుసకు తాత అవుతాడు. రోజు రోజుకు బాలికలో వస్తున్న మార్పులు గమనించిన తల్లి,   అనుమానంతో ఆసుపత్రికి తీసుకుపోయింది. పరీక్షలు చేసిన వైద్యులు ఏడు నెలల గర్భవతిగా  నిర్ధారించారు. దాంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. నిందితుడు జింకల పుల్లయ్య పై సెక్షన్ 376 ,6 పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన రేవనూరు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Tags:A minor who was pregnant with a girl

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *