ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం
విశాఖపట్నం ముచ్చట్లు:
ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్నం ఇన్ఛార్జ్ మంత్రి అయిన ఆమె శనివారం జిల్లా పర్యటనకు వెళ్లారు. హెల్త్ క్యాంప్ ప్రారంభోత్సవానికి వెళ్తుండగా లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. ఆమెతో పాటు మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఇతర అధికారులు లిఫ్ట్లో ఉన్నారు. సిబ్బంది సకాలంలో స్పందించి, ఎమర్జెన్సీ ‘కీ’తో లిఫ్ట్ తెరిచారు. దీంతో ఆమె ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
Tags; A missed opportunity for an AP minister

