మంత్రి పెద్దిరెడ్డికి తప్పిన ప్రమాదం
రాయచోటి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లె రింగ్ రోడ్డు వద్ద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి లకు ప్రమాదం తృటిలో తప్పింది. కాన్వాయ్ లోని ఎంపీ మిథున్ రెడ్డి వాహనాన్ని ఎదురుగా వచ్చిని కారు ఢీకొట్టింది. దాంతో మిథున్ రెడ్డి వాహనం పల్టీలు కొట్టింది. మిథున్ రెడ్డి వాహనంలో వెళ్తున్న పర్సనల్ పీఏ, భద్రతా సిబ్బంది కి తీవ్ర గాయాలు అయ్యాయి. వారినిరాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ల కుటుంబ సభ్యులందరూ సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుంగనూరు నుండి వీరబల్లిలోని అత్తగారిఇంటికి వెళ్తుండగా మార్గ మద్యంలో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి లు కలిసి మంత్రి వాహనంలో వెళ్తున్నారు.

Tags: A missed opportunity for Minister Peddireddy
