హైదరాబాద్ లో వాల్ పోస్టర్ల కలకలం
హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్ లో మరోసారి బీజేపీ నేత బీఎల్ సంతోష్ పోస్టర్ల కలకలం రేపాయి. బుధవారం రాత్రి ఒకకసారిగా ఈ పోస్టర్లు పలు ప్రాంతాల్లో కనిపించాయి. “కనబడుట లేదు..” అంటూ బీఎల్ సంతోష్ ఫొటోలతో పోస్టర్లు వెలిసాయి. ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు”.. అని పోస్టర్లు గుర్తుతెలియని వ్యక్తులు వేసారు. పట్టిచ్చిన వారికి బహుమానం కూడా ప్రకటించారు. బీఎల్ సంతోష్ ను పట్టిస్తే.. మోడీ హామీ ఇచ్చిన 15 లక్షల రూపాయలు.. బహుమానం అంటూ పోస్టర్లు లలో పేర్కోన్నారు. ప్రజలు బీఎల్ సంతోష్ పోస్టర్లను ఆసక్తిగా చూసారు.

