ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో ఓ సినిమా ప్రారంభం కానుంది

Date:06/05/2019
 న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా తెర‌కెక్క‌బోయే చిత్రంలో విల‌న్‌గా జ‌గ‌ప‌తిబాబు
శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు న‌ట‌సింహ నందమూరి బాల‌కృష్ణ హీరోగా ప్ర‌ముఖ దర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో ఓ సినిమా ప్రారంభం కానుంది. ప్ర‌ముఖ నిర్మాత, సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. `జైసింహా` వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న చిత్ర‌మిది. ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా న‌టించ‌బోతున్నారు. బ్లాక్‌బ‌స్ట‌ర్ `లెజెండ్‌` త‌ర్వాత బాల‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌లో ఈ చిత్రం రూపొంద‌నుంది. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్ సంగీత సార‌థ్యం వహిస్తున్నారు.
ఈ హిట్ కాంబోలో సినిమా మే 17న లాంఛనంగా ప్రారంభం అవుతుంది. జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సినిమాకు సంబంధించిన మిగ‌తా న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.
TagsA movie is going to be directed by Ravi Kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *