Natyam ad

నెల్లూరు లో మళ్లీ మర్డర్ కలకలం రేపింది.

నెల్లూరు ముచ్చట్లు:


నెల్లూరు లో మళ్లీ మర్డర్ కలకలం రేగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొండయ్యపాలెం గేట్ సెంటర్ హోటల్ టూరిజం వద్ద దారుణం జరిగింది.  బుజ బుజ నెల్లూరుకి చెందిన రౌడీ షీటర్  అందే గిరిష్ కుమార్ దారుణ హత్యకు గురయ్యాడు.సోమవారం అర్ధరాత్రి  సమయంలో ఈ ఘటన జరిగింది. గిరిష్ ను ఆటోలో అనుసరిస్తూ గుర్తుతెలియని దుండగులు ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు సమాచారం. నిందితుడి పై రెండు మర్డర్ కేసులు వున్నాయి. నెల్లూరు జంట నియోజకవర్గాల్లో పోలీసుల పనితీరు పై ప్రజల్లో అందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు ఎస్పీ పనిచేసి డిజిపి గా ఉన్న రాజేంద్రనాధ్ రెడ్డి నెల్లూరు నేరాల పై ధృష్టి పెట్టాలని ప్రతిపక్షలు  డిమాండ్  చేస్తున్నాయి.  పాత వివాదాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు పోలీస్ అధికారుల సమాచారం. ప్రస్తుతం హత్యకు గురైన గిరీష్ కుమార్ వెంకటరెడ్డి నగర్ లో నివాసం ఉంటున్నాడు.

 

Tags: A murder has created a commotion in Nellore again.

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.