Natyam ad

టీడీపీ ఎంపీ అభ్యర్థికి తృటిలో తప్పిన ప్రమాదం

ధర్మవరం ముచ్చట్లు:

 

హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పార్థసారధికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అనంతపురం నుండి మడకశిరకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.పార్థసారధి ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రానికి సమీపానగల ఎన్ హెచ్ 44 వద్ద ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద ఐచర్ వాహనం బ్రేక్ వేయడంతో వెనుక వైపు వస్తున్న పార్థసారథి ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో బీకే పార్థసారధి సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Post Midle

Tags; A narrow miss for the TDP MP candidate

Post Midle