తృటిలో తప్పిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదం
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖపట్నం నగరంలో శనివారం ఉదయం ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు ప్రమాదం తప్పింది. మెక్సి పికప్ వాహనం అడ్డుగా రావడంతో తప్పించబోయి ప్రమాద అంచుల్లోకి ట్రావెల్ బస్సు వెళ్లింది. బస్సు డ్రైవర్ చాకిచెక్యంగా బస్సును నిలిపాడు. ఈ ఘటన విశాఖ విమానాశ్రయం వద్ద ఎన్ హెచ్ 5 రోడ్ లో జరిగింది. విశాఖపట్నం నుంచి విజయవాడ బయలుదేరిన ఓ ప్రైవేట్ ట్రావెల్ శ్రీ పద్మావతి బస్సు విశాఖ విమానాశ్రయం కి వచ్చేసరికి అడ్డుగా మాక్స్ పికప్ వాహనం రావడంతో తప్పించకపోయి రోడ్డు పక్కకు బస్సు ఒరిగిపోయింది.. డ్రైవర్ చాకిచెక్యంగా వ్యవహరించి బస్సును అదుపు చేశాడు. ఈ బస్సులో సుమారుగా 40 మంది ప్రయాణం చేస్తున్నట్లు తెలుస్తుంది.
Tags: A narrow-miss private travel bus accident

