Natyam ad

బోయకొండలో తృటిలో తప్పిన ప్రమాదం

– గ్యాస్‌ సిలిండర్‌కు నిప్పంటుకొన్న వైనం
– పురుగులు తీసిన భక్తులు
-చాకచక్యంతో మంటలను ఆర్పేసిన సిబ్బంది
 
చౌడేపల్లె ముచ్చట్లు:
 
గ్యాస్‌ సిలిండర్‌కు ఒక్కసారిగా నిప్పంటుకొన్న సంఘటన ఆదివారం బోయకొండలో చోటుచేసుకొంది. ఈ సంఘటనలో ఆలయ, పోలీసు సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో తృటిలో ప్రమాదం తప్పింది. కర్ణాటక కు చెందిన భక్తులు బోయకొండ గంగమ్మ దర్శనం కోసం వచ్చారు. బోయకొండ ఆలయ సమీపంలోని ఖాలీ ప్రదేశంలో మధ్యాహ్న భోజనం తయారుచేసుకోవడానికి ఏర్పాటుచేశారు. వంట చేస్తున్న సమయంలో గ్యాస్‌ లీక్‌ అయి సిలిండర్‌కు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గమనించిన వంట మనిషి అక్కడనుంచి కేకలు వేశారు. అక్కడే ఉన్న సిబ్బంది చాకచక్యంగా మండుతున్న సిలిండర్‌ను ప్రజలున్న ప్రదేశం నుంచి దూరంగా దొర్లిచడంతో నీళ్ళు పోసి మంటలను అదుపు చేశారు. ఎలాంటి నష్టం జరుగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: A narrowly missed accident in Boyakonda