జీవవైవిద్యాన్ని కాపాడుతున్న  ప్రకృతి అధ్యయన కేంద్రం

విశాఖపట్టణం ముచ్చట్లు:


అది అసాధారణ వనం మాత్రమే కాదు.. అరుదైన వృక్ష, మొక్కజాతులకు నిలయం..! ఔషద, సుగంద మొక్కల సమూహం. ఎడారిలో పెరిగే చెట్లు, నీటిలో, చెట్లపై జీవం పోసుకునే మొక్కలకు అదొక ఆవాసం..! ఒక్క మాటలో చెప్పాలంటే.. రిటైర్డ్ ఉద్యోగులు, అధ్యాకుల సంరక్షణలో ఉన్న జీవవైవిద్యాన్ని కాపాడుతున్న అదొక ప్రకృతి అధ్యయన కేంద్రం. అదీ కూడా కాంక్రీట్ జంగిల్ గా మారిన ఆ నగరంలో..! అంతటి విశేషాలున్న ఆ వనం ఒకసారి గురించి తెలుసుకుందాం..కాలం మారిపోతోంది.. అడవులు అంతరించి పోతున్నాయి.. చెట్లు, మొక్కలు మనిషి ఆలోచనలకు బలై పోతున్నాయి. ప్రకృతి కన్నెర్ర చేస్తున్నా.. భవిష్యత్ హెచ్చరికలు జారి చేస్తున్నా ప్రకృతి వినాశనం జరుగుతూనే ఉంది. జీవ వైవిద్యం గాడి తప్పుతూ మనిషి మనుగడే కాదు.. జీవకోటికి ప్రాణ ముప్పు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా… ఆలోచనా విధానం మారడం లేదు. అందుకే చాలా వరకు వృక్షాలు అంటారించి పోతున్నాయి.

 

 

 

తద్వారా వాటిపై ఆధారపడిన పక్షులు, ఇతర జీవాల మనుగడ ప్రశ్నర్ధకమావుతోంది. ఫలితం… జీవావరణం నశించి ప్రాణకోటి ముప్పు వాటిల్లతోంది. ప్రాణకోటి జీవించ్చాలంటే జీవ వైవిద్యం అవసరం. జీవావరణం లేకపోతే… మనిషికే కాదు.. ప్రాణ కోటికి ఆహారం ఉండదు. ఇప్పటికే చెట్లు లేక పర్యావరణం దెబ్బతిని అనేక జీవరాసులు అదృశ్యమయ్యాయి. మనం తినే తిండి గింజలు, మందులు, ఔషధాలు, నివాసానికి ఉపయోగించే కలప, అన్నీ.. జీవవైవేద్యంతో కూడుకున్నవే. జీవ వైవిద్యాన్ని కాపాడుతూ ప్రకృతి వనాన్ని పెంచుతున్నారు విశాఖలోని కొంతమంది అధ్యాపకులు విద్యార్థులు రిటైర్డ్ ఉద్యోగులు. అనేక రకాల మొక్కలు వృక్షలను సంరక్షిస్తూ.. జీవరాసులకు జీవం పోస్తున్నారు.విశాఖ మిడిల్ అఫ్ ద సిటీలో గ్రీన్ వండర్ గా ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్న వనం. ఆర్ సి డి హాస్పిటల్ ప్రాంగణంలో.. మూడు ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఇందులో రెండున్నర వేల కు పైగా రకాల మొక్క వృక్షజాతులు జీవం పోసుకుంటున్నాయి. అరుదైన, అంతరించిపోతున్న వృక్షాలు మొక్కజాతులకు ఇక్కడ కనిపిస్తున్నాయి. 2001లో ఏర్పాటైన ఈ బయోడైవర్సిటీ పార్కును.. డాల్ఫిన్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ నిర్వహిస్తోంది. రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ రామమూర్తి ఆధ్వర్యంలో.. అధ్యాపకులు, రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు ఈ జీవవైవిద్య వనాన్ని సంరక్షిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఈ ప్రకృతి వనం లో సూక్ష్మమైన నాచు మొక్క నుంచి.. భారీ వృక్షాల వరకు ఉన్నాయి. అంతేకాదు.. ఎడారి మొక్కలు, నీటి మొక్కలు, ఈ వనంలో సంరక్షించబడుతున్నాయి. దేవతావృక్షం.. సరస్వతి ఆకు.. ఆరోగ్యాన్ని పరిరక్షించే అశ్వగంధ తో పాటు అనేక రకాల ఔషధ మొక్కలు, సువాసనలు వెదజల్లే సుగంధ ద్రవ్యాల మొక్కలు ఇక్కడ జీవం పోసుకుంటున్నాయి.జురాసిక్ రాక్షస బల్లుల కాలంనాటి అరుదైన జంగోబైలాస్ వృక్ష సంపద కూడా ఎక్కడ ఉంది. ముఖ్యంగా..

 

 

 

అరుదైన కీటకాహార మొక్కలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. కేవలం గాలిద్వారా పెరిగే మొక్కలు జీవం పోసుకుంటున్నాయి. అంతరిస్తున్న మొక్కలకు జీవం పోసి పర్యావరణాన్ని పెంపొందించాలని ఉద్దేశంతో అందరిలో బాధ్యత పెంచేలా.. మత విశ్వాసాలకు అనుగుణంగా ప్రత్యేక వనాలు ఇక్కడ రూపుదిద్దుకున్నాయి. రాశి, నక్షత్రాలు, నెల, సంవత్సరం పేరుతో చిన్నచిన్న వనాలు పెరుగుతున్నాయి. వినాయక వనం, నక్షత్రవనం, రాశి వనం ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు. పూజా పత్రాలు అందించే మొక్కలు ప్రాణం పోసుకుంటున్నాయి. సీతమ్మ జడ గా పిలవబడే మరో అరుదైన మొక్కజాతి విశేషంగా ఆకట్టుకుంటుంది.పెరుగుతున్న మొక్కలు వృక్షాలకు తోడు.. అరుదైన పుష్ప జాతులు ఇక్కడ కన్విందు చేస్తున్నాయి. వివిధ రకాల ఆర్కిడ్స్, రాఖీ ఫ్లవర్, విభిన్న జాతుల పుష్పాలు వికసిస్తున్నాయి. అందుకే.. ఈ అరుదైన జీవవైవిద్య ఉద్యానవనం కేవలం మొక్కలు వృక్షాలకే కాదు.. వాటిపై ఆధారపడే జీవరాసులకు ఆవాసంగా మారాయి. రకరకాల సీతాకోకచిలుకలు ఈ వనంలో విహరిస్తున్నాయి. కొన్ని రకాల సీతాకోకలు అక్కడే పురుడు పోసుకుని వనాన్ని ఆవాసంగా మార్చుకున్నాయి. ఎక్కడ పెరుగుతున్న వృక్షాలపై.. వివిధ రకాల పక్షులు వచ్చి చేరుతున్నాయి. ఈ జీవ వైవిధ్య ఉద్యానవనం.. కేవలం ఇక్కడ కొన్ని జీవరాసులకు ప్రాణం పోవడమే కాదు… విద్యార్థులకు ప్రత్యక్ష పరిశోధన శాలగా మారింది. పుస్తకాల్లో చదువుకున్న వృక్షజాతులు ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడంతో.. వాటిని చూసేందుకు క్యూకడుతున్నారు విద్యార్థులు.వేల రకాల మొక్కలు ఒకే చోట ఉండే విశాఖలోనీ ఈ బయోడైవర్సిటీ పార్క్..

 

 

 

ఎంతోమంది విద్యార్థులకు ప్రత్యక్ష ప్రయోగశాలగా మారింది. మొక్కలపై పరిశోధనలు చేసే విద్యార్థులు.. ఇక్కడకు వచ్చి అనేక విషయాలు తెలుసుకుంటున్నారు. అరుదైన మొక్క, పరిశోధనలు చేస్తున్నారు. ఇక్కడ వనంతో పాటు.. నీటి మొక్కలు పెరిగే చిన్న పాండ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఆ నీటిలోనూ.. మొక్కల మధ్య.. అనేక జీవరాసులు ఆవశంగా మార్చుకున్నాయి. చినుకు పడితే.. మొక్కల్లో నుంచి విరిసే పుష్పాలు కనువిందు చేస్తున్నాయి. అందుకే వర్షాన్ని సైతం లెక్కచేయకుండా.. విద్యార్థులు ఇక్కడ నిరంతరం వచ్చి అనేక విషయాలు తెలుసుకుంటారు. పుస్తకాలకే పరిమితమైన కొన్ని రకాల మొక్కజాతులను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉండడంతో.. ఇక్కడకు క్యూ కడుతుంటారు. విశాఖ లాంటి కాంక్రీట్ వనంలో.. అధ్యాపకులు, రిటైర్డ్ ఉద్యోగులు నిర్వహిస్తున్న ఇలాంటి అరుదైన జీవవైవిద్య వనం నుంచి స్ఫూర్తి పొందుతున్నారు.పచ్చదనాన్ని పెంచి.. జీవావరణాన్ని కాపాడాలని ఉద్దేశంతో టీవీ9 చేస్తున్న సీడ్ బాల్ను క్యాంపైను అభినందిస్తున్నారు ప్రకృతి ప్రేమికులుమరింత మందిలో స్ఫూర్తినిచ్చేలా చైతన్యాన్ని కలిగించి పర్యావరణాన్ని పరిరక్షిస్థాయని అంటున్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడేలా విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తూ ప్రత్యక్ష పరిశోధనలయంగా ఉన్న వనం. నిజంగా.. మొక్కలు వృక్షాలను సంరక్షిస్తూ విజ్ఞానాన్ని పంచుతున్న డాల్ఫిన్ నేచర్ కన్సర్వేటివ్ సొసైటీ సభ్యులకు సెల్యూట్ చేయాల్సిందే. వాళ్ళే కాదు.. మనిషి తో పాటు జీవరాశుల మనుగడ ఉండాలంటే.. ప్రకృతిపై మనలో బాధ్యత పెరగాలి. ఇటువంటి వాటిని పరిరక్షించాల్సి కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది.

 

Tags: A nature study center that preserves biodiversity

Leave A Reply

Your email address will not be published.