Natyam ad

ఓసీ వర్గాలోని పేద అక్కచెల్లెమ్మల జీవితాల్లో సరికొత్త కాంతులు

నంద్యాల ముచ్చట్లు:

ఓసీ వర్గాలోని పేద అక్కచెల్లెమ్మల జీవితాల్లో సరికొత్త కాంతులు నింపుతూ రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన 4,19,583 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైయ‌స్ఆర్‌ ఈబీసీ నేస్తం కింద ₹629.39 కోట్ల ఆర్థిక సాయాన్ని నంద్యాల జిల్లా బనగానపల్లె నుండి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయు సందర్భంగా స్థానిక కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వర్చ్యువల్ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 45-60 ఏళ్ల మధ్య ఉన్న ఈబీసీకి చెందిన మహిళలకు ఏటా రూ. 15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించి వారికి అండగా నిలిచే దిశగా ఈ.బి.సి నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి వర్యులు మొదలు పెట్టి కరోనా లాంటి ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా, వారి కష్టాలకు అండగా నిలుస్తున్నారని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో ప్రతి వర్గానికి సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇదేవిధంగా అందాలంటే ప్రజలందరూ వై.యస్.ఆర్.సి.ఫై కి అండగా ఉంది మరొక్కసారి జగన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ మేయరు, డిప్యూటి మేయర్లు, కమీషనర్, వివిధ కార్పోరేషన్ చైర్ పార్సన్లు, డైరెక్టర్లు, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారులు మరియు లబ్దిదారులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags; A new light in the lives of the poor sisters of the OC community

Post Midle