A new menu should be adopted in the midday meal plan

మధ్యాహ్న భోజన పథకంలో నూతన మెను పాటించాలి

– ఎంఈవో కేశవరెడ్డి

Date:20/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు అన్ని పాఠశాలల్లోను మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి నూతన మెను తప్పక పాటించాలని ఎంఈవో కేశవరెడ్డి ఆదేశించారు. సోమవారం కొత్తయిండ్లు హైస్కూల్‌ నందు నూతన మెను అమలుపై వంట కార్మికులకు, ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ఈనెల 21 నుంచి నూతన మెను ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వాదేశాల మేరకు మెను ను ప్రతి ఒక్కరు తప్పక పాటించాలన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోను మెనులో మార్పు చేసినా, పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని కోరారు.

మెను వివరాలు ….

సోమవారం : అన్నం, పప్పుచారు, గ్రుడ్డుకూర, చిక్కి
మంగళవారం: పులిహ్గర, టమోటాపప్పు, ఉడికించిన కోడిగ్రుడ్డు
బుధవారం: కూరగాయలతో అన్నం, ఆలూకుర్మా, ఉడికించినకోడిగ్రుడ్డు, చిక్కి
గురువారం: కిచిడీ, టమోటాచట్ని, ఉడికించినకోడిగ్రుడ్డు
శుక్రవారం: అన్నం, ఆకుకూరపప్పు, గ్రుడ్డు, చిక్కి
శనివారం : అన్నం, సాంబారు, స్పీట్‌ పొంగలి

పరాంకుశకు గిడుగురామమూర్తి అవార్డు

Tags: A new menu should be adopted in the midday meal plan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *