ధాన్యం సేకరణలో కొత్త విధానం
విజయవాడ ముచ్చట్లు:
ధాన్యం సేకరణలో అత్యంత పారదర్శకంగా రైతులకు డబ్బులు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంఎస్పీ కంటే పైసా తగ్గకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ధాన్యం కొనుగోళ్లపై కొత్త విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ఖరీఫ్ ధాన్యం సేకరణపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయాన్ని తీసేశామని చెప్పారు. కొత్త విధానంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిన్న సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. గోనెసంచులు సిద్ధం చేయడం, రవాణా, కూలీ ఖర్చుల రీయింబర్స్లో జవాబుదారీతనం ఉండేలా చూసుకోవాలన్నారు. రైతులకు మేలు చేసేలా మరింత మెరుగ్గా దీనిని తీర్చిదిద్దాలి. రవాణా, సంచుల ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తోందని రైతులకు వివరంగా చెప్పాలి’’ అని సీఎం అన్నారు. రైతులకు చేసే చెల్లింపులన్నీ అత్యంత పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు. కార్పొరేషన్ నుంచి డీబీటీ పద్ధతిలో డబ్బు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు.రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. రవాణా, గన్నీ బ్యాగుల ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఈ విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. రైతులకు కనీస మద్దతు ధర కన్నా..
ఒక్కపైసా తగ్గకుండా రేటు రావాలి. ఆ ఉద్దేశంతో కొత్త విధానానికి శ్రీకారం చుట్టాం. దీని కోసం ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయాన్ని తీసేశాం. చిన్న చిన్న సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. రైతులకు మేలు చేసేలా మరింత మెరుగ్గా దీన్ని తీర్చిదిద్దాలి. ధాన్యం సేకరణ కోసం తయారు చేసిన యాప్లో.. సిగ్నల్స్ సమస్యల వల్ల అక్కడడక్కగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆఫ్లైన్లో వివరాలు నమోదు చేసుకుని, సిగ్నల్ ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లగానే ఆ వివరాలన్నీ ఆటోమేటిక్గా ఆన్లైన్లోకి లోడ్ అయ్యేలా మార్పులు చేసుకోవాలి. అనేక ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఇలాంటి పద్ధతులు పాటిస్తున్నామని వైఎస్.జగన్ తెలిపారుమరోవైపు.. పౌర సరఫరాలశాఖ జిల్లా మేనేజర్ల విధులపై ఎస్ఓపీలను తయారుచేయాలని సీఎం జగన్ సూచించారు. వీటిని పాటించేలా పర్యవేక్షణ ఉండేలా చూడాలన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కలిగించాలన్న ముఖ్యమంత్రి.. వారిని ప్రోత్సహించాలని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిల్లెట్స్ సాగు పెరిగిందన్న ఆయన.. కోరుకున్న వారికి వాటిని సరఫరా చేయాలని వివరించారు.

Tags: A new method of grain collection
