Natyam ad

క్రికెట్ బెట్టింగ్ లోనూ నయా ట్రెండ్

ఏలూరు ముచ్చట్లు:


క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుండడంతో బెట్టింగ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. పట్టణాలకే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్ ప్రశాంతమైన గ్రామాలలో పంజా విసురుతోంది. అమాయకులైన రోజువారీ కూలీలు కూడా ఈబెట్టింగ్ కు పాల్పడుతున్నారు. ఏమీ తెలియని అమాయకులు ప్రతీ బంతికి బెట్టింగ్ పెట్టి తీవ్రంగా నష్టపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.పశ్చిమగోదావరి జిల్లా పాలకొడేరు మండలం మోగల్లులో క్రికెట్ బెట్టింగ్ ముఠాపై పోలీసుల దాడి చేసారు. ఒక ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 14 మందిని అరెస్ట్ చేసారు. వీరి నుండి 49000 క్యాష్, టివి, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన వారినుండి తీసుకున్న సమాచారంతో 25 ముంది క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.25 మందిపై పోలీసుల కేసులు నమోదు చేశారు. గతంలో క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో ఉన్నవారిని గుర్తించి నిఘాపెడుతున్నారు. వాట్సాప్ గ్రూప్ లలో కొత్త టెక్నాలజీ ఉపయోగించి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు . వాట్సాప్ గ్రూప్ లింక్ లలో యూజర్ నేమ్, పాస్ వర్డ్ లతో లాగిన్ అయి బెట్టింగ్
నిర్వహిస్తున్నాని పోలీసులు చెబుతున్నారు. వీరందరినీ గుర్తిస్తున్నామని పోలీసులు అంటున్నారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ప్రశాంతమైనగ్రామాలలో యువకులు క్రికెట్ బెట్టింగ్ కు అలవాటు పడి జీవితాలను నాసనం అవుతుండడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈజీ మనీ వస్తుందని అత్యాశతో క్రికెట్ బెట్టింగ్ ఆడి చివరకు

 

 

పోలీసులు దొరికి కేసుల్లో చిక్కుకుంటున్నారుగతంలో క్రికెట్ బెట్టింగ్ సెల్ ఫోన్ లైన్ బాక్స్ ల ద్వారా చేసేవారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ ద్వారా బెట్టింగ్ ఆడుతున్నారు. కొత్తగా వాట్సాప్ ను బెట్టింగ్ కువాడుతున్నారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి లింక్ పంపిస్తారు. బెట్టింగ్ నిర్వాహకులు బెట్టింగ్ ఆడే వ్యక్తికి లింక్‌తో పాటు యూజర్ నేమ్, పాస్ పోర్ట్ పంపిస్తారు. అతను లింక్ ఓపెన్ చేసి యూజర్ నేమ్, పాస్ వర్డ్ తో లాగిన్ అయ్యి బెట్టింగ్ కాస్తుంటారు. బెట్టింగ్ డబ్బులు ఆన్లైన్ లోనే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. పోలీసుల కళ్ళు కప్పేందుకు ఇటువంటి యాప్ లు వాడుతున్నారు బెట్టింగ్ ముఠా. గతంలో బెట్టింగ్
జరిపేవారిపై నిఘా పెట్టారు పోలీసులు. వారి నుండి వచ్చే సమాచారంతో దాడులు చేస్తున్నారు.

 

Post Midle

Tags:A new trend in cricket betting

Post Midle