Natyam ad

లిక్కర్ స్కాం ఎపిసోడ్’లో కొత్త ట్విస్ట్

న్యూఢిల్లీ ముచ్చట్లు:


సన్ స్ట్రోక్ తో రాజకీయంగా పడకెక్కిన రాజకీయ నాయకులున్నారు. అలాగే డాటర్ స్ట్రోక్ తో తలకిందులైన రాజకీయ నాయకులు కూడా  ఉన్నారు. ఎవరిదాకానో ఎందుకు, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు కుమార్తె, తెరాస ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ఇరుక్కున్న నేపధ్యంలో తెరాస రాజకీయ ప్రత్యర్ధులు అదే అంటున్నారు. ముఖ్యమంత్రి డాటర్ స్ట్రోక్  దెబ్బ కొట్టిందని వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అద్దంకి దయాకర్ అలాంటి చురకే అంటించారు. రాజకీయ నేతలకు సన్ స్ట్రోక్, డాటర్ స్ట్రోక్ కామనే   అంటూనే  దయాకర్ ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఇరుక్కోవడం వల్ల కేసీఆర్ కు డాటర్ స్ట్రోక్ తగిలిందని అన్నారు. అలాగే ఆయన, గతంలో కరుణానిధి తన కుమార్తె కనిమొళి వల్ల డాటర్ స్ట్రోక్ కు గురయ్యారని గుర్తు చేశారు. నిజానికి, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పేరు పైకి వచ్చినప్పటి నుంచి  కవిత ఎపిసోడ్ ను కనిమొళి అరెస్ట్  ఉదంతంతో కలిపి చూస్తున్నారు. ఆమెలాగే ఈమె కూడా జైలుకు పోక తప్పదని, అంటున్నారు. అప్పుడు కేంద్రంలో డిఎంకే భాగస్వామ్య పక్షంగా ఉన్న యూపీఎ అధికారంలో ఉన్నా  కనిమొళి జైలుక్లు వెళ్ళక తప్పలేదు  అలాంటిది ఇప్పుడు కేసీఆర్ కోరి కయ్యం తెచ్చుకున్న బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న నేపధ్యంలో  కవిత అరెస్ట్, ముఖ్యమంత్రి కేసీఆర్  కు డాటర్ స్ట్రోక్ తప్పక పోవచ్చని అంటున్నారు. ఢిల్లీ లిక్కర స్కామ్ లో కల్వకుట్ల కవిత డాటరాఫ్… కేసీఆర్’ ఎపిసోడ్’లో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. రెండురోజుల క్రితం సిబిఐ విచారణకు స్వాగతం పలికిన కవిత, తర్వాత ప్రగతి భవన్ లో  ముఖ్యమంత్రితో రెండు విడతలుగా చర్చలు జరిపిన తర్వాత యూ టర్న్ తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వివరణ కోసం సీబీఐ సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసు ఇష్యూ చేసింది. ఆవెంటనే ఆమె, పాజిటివ్ గా స్పందించారు.

 

 

 

నో ..ఇష్యూ… యువార్ మోస్ట్ వెల్కమ్, హైదరాబాద్ లోని మా ఇంటికే రండి మాట్లాడుకుందామని సిబిఐ అధికారులకు రిప్లై ఇచ్చారు.సిబిఐ అధికారులు ఎంత పొలైట్  గా ఆమెను రిక్వెస్ట్ చేశారో, ఆమె కూడా వారికి అంతే పొలైట్ గా సమాధానం ఇచ్చారు. అయితే, ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీ పెద్దలు, న్యాయ కోవిదులతో చర్చలు జరిగిన తర్వాత ఆమె సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని  ఆ తర్వాతనే ఎక్కడ, ఎప్పుడు మాట్లాడుకోవాలో నిర్ణయించుకోవాలని ‘చిన్న’ మెలిక పెట్టారు. ఈమేరకు ఆమె సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి లేఖ రాశారు. అయితే కవిత యూ టర్న్ వెనుక మతలబు ఏమిటనేది, ఎవరికీ అంటూ చిక్కడం లేదు. న్యాయవాదుల సలహా మేరకు  కొంత గడువు తీసుకునేందుకే కవిత, యూటర్న్  తీసుకున్నారని అంటున్నారు. అదెలా  ఉన్నా రోజులు గడిచే కొద్ది  ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కొత్త విషహాయాలు వెలుగు చూస్తున్నాయి. ఇతవరకు  వినిపించని కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో  తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రుల పాత్ర ఉందని ఆరోపించారు. నిజమే  ఢిల్లీ లిక్కర్ స్కామ్  నిజమైతే,అందులో కవిత పాత్ర రుజువైతే, కేసేఆర్ పాత్ర నిజంగా లేక పోయినా ప్రజలు ఉందనే అనుకుంటాఋ, కానీ  తరుణ్ చుగ్ ఒక్కసారిగా కేసీఆర్ పేరు ప్రస్తావించడంతో ..ఢిల్లీ లిక్కర్ స్కామ్  మరింత ఆసక్తి కరంగా మారింది. కవిత పేరును కూడా ముందుగా బీజేపీ నాయకులే బయట పెట్టారు … కేసేఆర్ పేరు కూడా బీజేపీనే తెరపైకి తెచ్చింది …  అంటే కహానీ ఔర్ బాకీ హై..

 

Post Midle

Tags: A new twist in the liquor scam episode

Post Midle