పుంగనూరులో రోటరీక్లబ్ నూతన కార్యవర్గం
పుంగనూరు ముచ్చట్లు:
రోటరీక్లబ్ నూతన కార్యవర్గం గురువారం జిల్లా గవర్నర్ ఉదయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో ఎంపికైంది. రోటరీ అధ్యక్షుడుగా కిషోర్, సెక్రటరీగా సుధాకర్‌రెడ్డి, కోశాధికారిగా హరిప్రసాద్ లు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ రోటరీక్లబ్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, రోటరీ సేవలు ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ సీనియర్ సభ్యులు డాక్టర్ ప్రభాకర్ , డాక్టర్ శరణ్, త్యాగరాజు, అమరేంద్ర , రెడ్డెమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags: A new working group of Rotary Club in Punganur
