పురోగతి లేని జాతీయ ఆరోగ్య మిషన్

Date:21/09/2019

హైదరాబాద్‌ ముచ్చట్లు:

జాతీయ ఆహార భద్రతా చట్టం జాతీయ ఆరోగ్య మిషన్ వంటి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం వారు అమలు చేశారు. కానీ, వాటిలో ఏ మాత్రం పురోగతి లేదు. ఆకలి సమస్యను అధిగమించాలంటే దేశంలో అనేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే మొదటిది డబ్బు. దైనందిన కార్యకలాపాలకు అవసరమైన శక్తిని పొందాలంటే కావల్సిన తిండి సమకూర్చుకోవాలి. అందుకు తగినంత డబ్బుండాలి. అయితే పేద ప్రజల్లో ఆదాయమే పెద్ద సమస్య.దేశ జనాభాలోని ఎక్కువ శాతం మంది ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ ఉండడంతో భారత ఆరోగ్య ముఖ చిత్రం ఏ మాత్రం ఆశాజనకంగా లేదు.

 

 

 

 

అనారోగ్యంతో కునారిల్లుతున్న మానసిక దుర్బలులు ఈ దేశాన్ని పరిపాలిస్తుంటే, బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మించబడుతుందా? అభివృద్ధి లక్షాల్ని అందుకోగలమా? ప్రత్యేకించి గ్రామీణ, పట్టణ పేదల స్థితి ఆందోళనకరంగా ఉందన్నది పాలకులు గ్రహిస్తారా? ఇతర ఎన్నెన్నో కారణాలతో పాటు ఆకలి, పోషకాహారలోపం దేశ ప్రజల ఆరోగ్యాన్ని బాగా దెబ్బ తీస్తూ ఉందన్న విషయంపై దృష్టి సారిస్తారావ్యవసాయంపై దృష్టి పెట్టకుండా పేదరికాన్ని, ఆకలిని, పోషకాహార లోపాన్నీ తొలగించడం సాధ్యం కాదు. ఒక అమెరికన్ అధ్యయన సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం పట్టణాల మౌలిక సదుపాయాలకు పెట్టే ఖర్చు కంటే వ్యవసాయ రంగానికి పెట్టే పెట్టుబడులు ఐదు రెట్లు తక్కువ. అలాంటప్పుడు పేదరికం ఎలా నిర్మూలించబడుతుంది? కనీసం అందరికీ ఆహారం దొరికే పరిస్థితి కూడా లేదు కదా?

 

 

 

 

 

మన ఆర్థిక వేత్తలు, విధాన కర్తలు ఒక వైపు మార్కెట్ సంస్కరణలు తీసుకు రావాలనుకుని, వ్యవసాయ రంగానికి ఒక పద్ధతి ప్రకారం ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారు. కాని, దేశంలో ఆకలి కేకలు లేకుండా చేయాలంటే ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెట్టుబడులు కేటాయించాలి తీసుకు రావాలి. నూతన సేద్య విధానాల్ని ఆవిష్కరించాలి. “సబ్ కా సాథ్ సబ్‌కా వికాస్’ అనేది నినాద ప్రాయంగా మిగిలిపోకుండా దానికి వాస్తవ రూపమియ్యగలిగేది ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే! ఆహారం అనేది గ్రామీణ ప్రజలకు సంబంధించింది మాత్రమే కాదు, పట్టణ, నగర ప్రజలకు సంబంధించింది కూడాడ!

 

 

 

 

అన్నం రొట్టెలకే కాదు పిజ్జా బర్గర్ల క్కూడా ధాన్యం కావాలి. అలాగే ఆధార్ కార్డ్ లేనంత మాత్రాన ఆహారం అందించకుండా ఉండకూడదన్న విషయం ఆధార్ చట్టం స్పష్టంగానే చెప్పింది.మధ్యాహ్న భోజన పథకం ప్రత్యేక పోషకాహార కార్యక్రమం ఇంటి గ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ నేషనల్ ప్లాన్ ఆఫ్ ఏక్షన్ ఆన్ న్యూట్రిషన్ ప్రజా పంపిణీ వ్యవస్థ జాతీయ ఆహార భద్రతా చట్టం జాతీయ ఆరోగ్య మిషన్ వంటి అనేక కార్యక్రమాలు మన ప్రభుత్వం వారు అమలు చేశారు. కానీ, వాటిలో ఏ మాత్రం పురోగతి లేదు. ఆకలి సమస్యను అధిగమించాలంటే దేశంలో అనేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

 

 

 

 

అన్నిటికంటే మొదటిది డబ్బు. దైనందిన కార్యకలాపాలకు అవసరమైన శక్తిని పొందాలంటే కావల్సిన తిండి సమకూర్చుకోవాలి. అందుకు తగినంత డబ్బుండాలి. అయితే పేద ప్రజల్లో ఆదాయమే పెద్ద సమస్య. ఉదాహరణకు వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కూలీలు, అట్టడుగు వర్గాల ప్రజలు, అనధికార రంగ శ్రామికుల విషయం చూద్దాం. వారికి వారి పనికి తగిన ఆదాయం అండమే లేదు. మంచి ఆహారం ఎలా సంపాదించుకుంటారు? ఇటీవలి పేదరిక గణాంకాల ప్రకారం దేశ జనాభాలో సుమారు 22 శాతం మంది ఇప్పటికీ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. నోట్ల రద్దు తర్వాత అనధికార రంగ శ్రామికుల ఆదాయం దారుణంగా దెబ్బతిన్న విషయం అందరికీ తెలిసిందే.

 

 

 

 

దేశంలో నిరుద్యోగం పెరిగిందని, సామాజిక అసమానత్వం పెచ్చరిల్లిందని అంతర్జాతీయ కార్మిక సంస్థ చేపట్టిన 2017 ‘వరల్డ్ ఎంప్లాయిమెంట్ అండ్ సోషల్ ఔట్‌లుక్’ రిపోర్టు తెలిపింది. ప్రభుత్వాలు వీటిపై దృష్టి పెట్టడం తక్షణం చేయాల్సిన పని. సాధారణంగా ఏ మనిషైనా కోరుకునేది చక్కని ఆర్యోగం! కాలమంతా ఆరోగ్యంగా బతకడం అవసరం. ముఖ్యంగా మనం ఏదైనా సాధిం చాలని పట్టుదలగా ప్రయత్నిస్తున్నప్పుడు జబ్బు బారిన పడితే మన అనారోగ్యం మన లక్షానికి ఆటంకం కలిగిస్తే ఆరోగ్యం విలువ అప్పుడు మరింతగా తెలిసొస్తుంది. మంచి ఆరోగ్యానికి కావల్సినవన్నీ పుట్టినప్పటి నుంచి అందుబాటులో ఉన్నవాళ్లు తర్వాత కాలంలో కూడా ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతుకుతారు.

 

 

 

 

జీవితంలో తమ లక్ష్యాల్ని సులభంగా సాధించుకుంటారు.అలాంటి సదుపాయాలు లేనివాళ్లు కారణాలేవైనా వెనకబడిపోతారు. అనారోగ్యం వల్ల కలిగే దుష్ప్రభావాలను వ్యక్తులు అర్థం చేసుకున్నట్లుగానే అంతర్జాతీయ సంస్థలు,జాతీయ ప్రభుత్వాలు కూడా ప్రజల అనారోగ్యాల గురించి గుణపాఠాలు నేర్చుకుంటూ ఉండాలి. ఆకలి, పోషకాహార లోపం ప్రజారోగ్యంపై తీవ్రమైన ప్రభావాల్ని చూపుతున్నాయి. మన దేశంలో ఈ సమస్య తీవ్రతకు సంబంధించిన గణాంకాలు భయం గొలుపుతున్నాయి.

 

 

 

 

 

ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక ప్రకారం 20142016 మధ్య కాలంలో ప్రపంచంలో ఆకలితో అలమటించిన వారు పోషహాకార లోపం ఉన్నవారు మన దేశంలోనే ఎక్కువ మంది ఉన్నారని తేలింది. దేశ జనాభాలో 15 శాతం మంది అంటే సుమారు పందొమ్మిదిన్నర కోట్ల మంది తగినంత ఆహారం లేకపోవడం వల్ల తీవ్రమైన బాధలకు గురయ్యారు.అలాగే కొన్ని దుష్ప్రభావాలు పిల్లల్లోనే కనిపించాయి. 201516 సంవత్సరంలో దేశ జనాభా స్థితిగతులపై జాతీయ కుటుంబ ఆరోగ్య అధ్యయనం ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ 4 గణాంకాల ప్రకారం 659 నెలల మధ్య వయసు పిల్లల్లో యాభై ఎనిమిదిన్నర శాతం మంది ఐరన్, విటమిన్, ఇతర పోషకాల లోపాల వల్ల రక్తహీనత  తో బాధపడుతున్నారు.

 

 

 

 

 

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల పిల్లల్లో తక్కువ బరువు, వయసుకు తగిన శరీరం ఎదగకపోవడం, శుష్కించి పోవడం ఎక్కువగా కనిపిస్తున్నాయని సర్వే స్పష్టం చేసింది. దాని ప్రకారం ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదగకుండా ఉన్న వారిలో 39 శాతం దళిత కుటుంబాలకు చెందిన వాళ్లయితే 34 శాతం మంది గిరిజన కుటుంబాలకు చెందిన వాళ్లు. మిగతా జనాభాలోని పిల్లల్లో ఇది వరుసగా 28 శాతం, 27 శాతంగా ఉందినిరుపేదలు మాత్రమే కాదు, మధ్య తరగతి, సంపన్న వర్గాల్లోనూ పోషకాహార లోపం విపరీతంగా కనిపిస్తోంది. అయితే అది ఆకలి వల్ల కాదు. ఎక్కువ మొత్తంలో రెడీమేడ్ ఆహార పదార్థాల్ని తీసుకోవడం, కదలికలు లేకుండా, తగిన శారీరక శ్రమ, వ్యాయామం లేకుండా ఒకే చోట కూర్చుని పని చేయడం కారణంగా వారిలో ఊబకాయం వస్తూ ఉంది. వారి జీవన శైలిలో లోపాలు తలెత్తుతున్నాయి.

 

 

 

 

సమతుల ఆహారం లేక, సమతులమైన ఆలోచనా విధానమూ లేక, బద్ధకం పెరిగిపోయి, భారమంతా ఏదో ఓ దైవ శక్తిపై వేసి, బతుకీడుద్దామనుకునే వారు కూడా ఇందులో ఉంటారు.తలసరి ఆదాయం తక్కువగా ఉన్న కుటుంబాలు, నిరక్షరాస్యత గల కుటుంబాలు, శుభ్రత పట్ల అవగాహనలేని కుటుంబాల పిల్లల్లో పోషకాహార లోపం అధికంగా ఉంది. ఇలాంటి కుటుంబాల వారికి సామాజిక, వైజ్ఞానిక స్పృహలు ఉండడం చాలా అరుదు. వీరు సులభంగా మోసపు దొంగ బాబాల స్వాముల బోధనలకు ఆకర్షితులవుతారు. కొద్దిపాటి డబ్బు అందించిన ఏ చోటా నాయకుడికైనా జై కొడతారు. క్షుద్ర శక్తులున్నాయని నమ్ముతుంటారు.

 

 

 

 

 

క్షుద్ర పూజలు చేస్తుంటారు. వివేకవంతులై ఆలోచించగలిగే శక్తి లేకపోవడం వల్ల సులభంగా మూఢ నమ్మకాలకు ఆకర్షితులవుతారు. సరైన పోషణ, ఆహారం లేక నీరసించిపోయే శరీరాలకు ఏదో ఒక ఆలంబన, ఆసరాగా దైవ విశ్వాసాలు పని చేస్తాయి. పైగా కుటుంబపరంగా, వంశపారం పర్యంగా వచ్చే అంధ విశ్వాసాలు వారి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. అట్లని సరైన ఆహారం తీసుకునే వారంతా అంధ విశ్వాసాలకు దూరంగా ఉంటున్నారా? అంటే లేదు.. అందుకు మళ్లీ ఎన్నో కారణాలున్నాయి. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వారు ‘లేని శక్తుల్ని’ నమ్ముకోవడం జరుగుతోంది.

పర్యావరణానికి విఘాతం కలిగించే ప్లాస్టిక్‌ను అంతం చేద్దాం

Tags: A non-progressive National Health Mission

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *