నర్సింగ్ విద్యార్థినిని మేడపై నుండి తోసేసిన తోటి విద్యార్థినులు
కోనసీమ ముచ్చట్లు:
అంబెడ్కర్ కోనసీమ జిల్లా ముక్తేశ్వరంలో ఉన్న వైవిఎస్ & బి.ఆర్.ఎస్.ఎం నర్సింగ్ కాలేజీలో దారుణం జరిగింది తోటి విద్యర్ధినిలే మరో విద్యార్థినిని మేడ పై నుండి తోసేవేసారు. నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పల్లవి(19), శనివారం ఉదయం రెండవ అంతస్థు పై నుండి గెంటేసారు. ఘటనలో పల్లవి కి తీవ్ర గాయాలు అయ్యాయి. కాలు, చేయి, మూడు చోట్ల ఎముకలు విరిగాయి. పల్లవిని
అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాలేజీ హాస్టల్ రూంలో ఎనిమిది మంది విద్యార్థినులు కలిసిన ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఒకరి డబ్బులు పోయాయని అందరి బ్యాగ్స్ వెతికారు. ఉదయం బ్రెష్ చేస్తున్న సమయంలో తనను వెనక నుండి గెంటేశారని పల్లవి అంటోంది.
Tags;A nursing student was pushed down the stairs by her fellow students

