పెద్దపంజాణి మండలంలో ఏనుగులు దాడి వ్యక్తి మృతి
పెద్దపంజాణి ముచ్చట్లు:
పెద్దపంజాణి మండలం ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మార్కండేయులు అనే వ్యక్తిపై ఏనుగులు శనివారం రాత్రి దాడి చేసి చంపివేసిన సంఘటన వెలుగు చూసింది. పొలం వద్ద నుంచి ఇంటికి వెళుతుండగా ఏనుగులు దాడి చేసింది. ఈ ప్రమాదంలో మార్కండేయులు అక్కడికక్కడేమృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు ఎంపీ రెడ్డప్ప.అటవీ శాఖ అధికారులతో మాట్లాడిమృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు .మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఏనుగు దాడిలో మృతి చెందిన మృతుడి కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందించి అన్ని విధాల కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు .అలాగే ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags: A person attacked by elephants died in Pedpadanjani mandal
