Natyam ad

వ్యక్తి ఆత్మహత్య

అంబేద్కర్ ముచ్చట్లు:


అంబేద్కర్ జిల్లా అయినవిల్లి మండలం ఎస్.మూలపాలెం గ్రామంలో పురుగుల మందు సేవించి నామాల శేషగిరి (30) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తాడేపల్లి గూడెం పరిసర ప్రాంతంలో డైరీఫాం నడుపుతున్న తన వద్ద నుండి ఆవుని దొంగిలించుకు వచ్చాడని శేషగిరి పై వరప్రసాద్ ఆరోపణలు చేస్తున్నాడు. మంగళవారం నాడు  లక్ష రూపాయలు అప్పు ఇప్పిస్తానని వరప్రసాద్ ని ఎస్.మూలపాలెం రమ్మని మద్యం మత్తులో పాడుబడిన బావిలోకి శేషగిరి తోసేసాడని సమాచారం. అయితే, వరప్రసాద్ సురక్షితంగా బావినుంచి బయటపడ్డాడు. దాంతో  విషయం బయటపడిపోతుందన్న భయంతో శేషగిరి ఆత్మహత్య చేసుకొన్నట్లు ప్రసాద్ ఆరోపించాడు. పోస్టుమార్టం నిమిత్తం శేషగిరి మృతదేహాన్ని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

Tags: A person commits suicide

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.