రైలు కిందపడి వ్యక్తి మృతి

మచిలీపట్నం ముచ్చట్లు:


మచిలీపట్నంలో రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసుల సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి వంటిపై మహాలక్ష్మి జనరల్ ట్రేడర్స్ పేరుతో టీ షర్ట్ ఉండడంతో సిమెంట్ షాపులో కూలీగా భావిస్తున్నారు. సంబంధిత షాప్ యజమానికి రైల్వే పోలీసులు సమాచారం ఇవ్వడంతో అనేక మందికి కంపెనీ టీషర్ట్లు ఇస్తామంటూ బదులు ఇచ్చాడు. దీంతో మృతుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 45 సంవత్సరాలు ఉంటుంది. తల, కాళ్లు తెగిపోవడంతో గుర్తుపట్టలేని విధంగా మృతదేహం వుంది. మృతదేహాన్ని బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 

Tags: A person died after being hit by a train

Leave A Reply

Your email address will not be published.