Natyam ad

బైకు కాలువలో పడి వ్యక్తి మృతి

ఏలూరు ముచ్చట్లు:


కొల్లేటి కోట పెద్దింటిలమ్మ దేవస్థానం మాజీ చైర్మన్
కైకలూరు మండల  వడ్ల కూటి తిప్ప గ్రామానికి చెందిన సైదు  దుర్గారావు పెద్ద కుమారుడు సైదు అశోక్ (31)  ఆదివారం రాత్రి ఏలూరు మండలం కలకుర్రు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో ఆదివారం అర్ధరా త్రి మృతి చెందాడు.మృతుడు ద్విచక్ర వాహనం పై వడ్ల కూటి తిప్పనుండి ఏలూరు వస్తుండగా కలకుర్రు మహేశ్వరపురం గ్రామాల మధ్యలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి రహదారి ప్రక్కనున్న కాలువలో పడి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు మృత దేహాన్ని బయటకు తీసి   పోస్ట్ మార్టం కై ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎం ఎల్ సి జయ మంగళ వెంకట రమణ, వడ్డీ కార్పొరేషన్ డైరెక్టర్ మండల కొండలరావు, ప్రముఖ కొల్లేరు వై సి పి నేత మొరు రామరాజు, కొల్లేరు సొసైటీ మాజీ అధ్యక్షులు సైదు సత్యనారాయణ, ముంగర సంజీవ్ కుమార్, ఘంటసాల పెద్దిరాజు, ప్రత్తి కోళ్ల లంక సర్పంచ్ ఘంటసాల మహాలక్ష్మీరాజు, పలువురు కైకలూరు.మండవల్లి మండలాలకు చెందిన కొల్లేటి సంఘ పెద్దలు, .నాయకులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతుడు అశోక్ కి నివాళులర్పించారు.పెద్ద కొడుకును కోల్పోయిన  దుర్గారావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేసారు.

 

Tags; A person died after his bike fell into the canal

Post Midle
Post Midle