Natyam ad

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

గూడూరు ముచ్చట్లు:


నాయుడుపేట అగ్రహారం ప్రాంతానికి చెందిన హరికృష్ణ (35) వెంకటాచలం మండలం పోర్టు రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు . ఆయన మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు .  పోలీసుల సమాచారం మేరకు హరికృష్ణ కృష్ణపట్నం పోర్ట్ సమీపంలో ఇటుక రాయి బట్టీలో పని చేస్తున్నాడు . ఈ క్రమంలో  నాయుడుపేట కు వెళ్లేందుకు అతనితో పాటు మరో 5 మంది పోర్టు రోడ్డు వద్ద వాహనం కోసం ఎదురుచూస్తుండగా ఒక లారీ ఆగడంతో లారీలో ప్రయాణించేందుకు ఎక్కుతుండగా  వెనుక నుండి మరొక లారీ ఢీకొనడంతో హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు . పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు .

 

Tags: A person died in a road accident

Post Midle
Post Midle