Natyam ad

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మార్టూరు ముచ్చట్లు:


దైవదర్శనానికి వెళ్లి వస్తున్న కుటుంబం మార్టూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో  తీవ్ర గాయాలకు  గురయ్యారు. చికిత్స కోసం తరలిస్తుండగా మార్గ మధ్యలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా మార్టూరు పట్టణంలోని ఎక్ప్ ప్రెస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై చోటుచేసుకుంది.
కృష్ణా జిల్లా జి కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామానికి చెందిన బూసు వెంకటరమణ తన భార్య శివపార్వతి కుమార్తెలు భార్గవి, శ్రావణి, కుమారుడు మోక్షజ్ఞ సమీప బంధువైన గట్టు నవీన్ తో కలిసి స్నేహితుడి కారు తీసుకొని దైవదర్శనానికి తిరుపతి వెళ్లారు. దర్శనం అనంతరం వీరు తమ కారులో విజయవాడ బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు మార్టూరు చేరుకోగానే పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై ఒక్కసారిగా  టైర్ పేలడంతో అదుపు తప్పి ముందు వెళుతున్న ఐషర్ లారీని బలంగా డీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న గట్టు నవీన్ కారులోని వెంకటరమణ దంపతులు,ముగ్గురు పిల్లలు . తీవ్రంగా గాయపడ్డారు. ముందు వెళుతున్న లారీ డ్రైవర్ జరిగిన ప్రమాదాన్ని గుర్తించకపోవడంతో  కారుని లారీ కొద్దిదూరం ఈడ్చుకొనిపోయింది వెనుక వస్తున్న వాహనదారులు లారీని వెంబడించి ఆపడంతో డ్రైవర్ లారీని ఆపాడు. స్థానికులు స్పందించి కారు డోర్ లు పగలగొట్టి క్షతగాత్రులను బయటకు తీశారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ సిబ్బంది గరుత్మంతుడు,రాజేష్.నాయక్ బ్రిడ్జిపై నిలిచిపోయిన ట్రాఫిక్ ని క్రమబద్దీకరించారు,  గాయపడిన ఆరుగురికి 108 సిబ్బంది శోభన్, రాము ప్రధమ చికిత్స అందించి గుంటూరు సమగ్ర వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో గట్టు నవీన్ మృతి చెందాడు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ ఇంచార్జ్ సాయిరాం తెలిపారు.

 

Tags: A person died in a road accident

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.