రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
బద్వేలు ముచ్చట్లు:
బద్వేలు నెల్లూరు 67 జాతీయ రహదారిలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుబ్బారెడ్డి (48) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బద్వేల్ పట్టణం ఆంజనేయ నగర్ వీధికి చెందిన సుబ్బారెడ్డి బద్వేల్ నుండి పి పి కుంటకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనకనుంచి వచ్చిన వాహనం ఢీ కొట్టింది. దీంతో సుబ్బారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం గోపవరం మండలం ద్వారకా నగర్ సమీపంలో జరిగింది. మృతుని స్వగ్రామం బి కోడూరు మండలం అంకన గొడుగునూరు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బద్వేలు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: A person died in a road accident

