పుంగనూరులో వ్యక్తి మృతి

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని ఒంటిమిట్ట గ్రామానికి చెందిన సుధాకర్‌ (39) అతిగా మధ్యం సేవించి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు సుధాకర్‌ మంగళవారం రాత్రి మధ్యం సేవించేందుకు గ్రామ సమీపంలోని జొన్నబావి వద్దకు వెళ్లాడు. అక్కడ మధ్యం సేవిస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. బావిలో శవమై ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ శవాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేశారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 

Tags: A person died in Punganur

Leave A Reply

Your email address will not be published.