పుంగనూరులో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని ఆరడిగుంటకు చెందిన లింగయ్య (40) అనుమానస్పద స్థితిలో మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. లింగయ్య గురువారం రాత్రి ఇంటిలో ఉన్న లింగయ్య నిద్ర పట్టడం లేదని, ఇబ్బందిగా ఉందంటు ఇంటిలో చెప్పి అటు సచివాలయం మార్గం వైపు వచ్చి ఆకస్మాత్తుగా అక్కడిక్కడే మృతి చెందాడు. ఉదయం లింగయ్య మృతదేహాన్ని కనుగొన్న కుటుంబ సభ్యులు ఆయన మృతిపై దుష్పచారాలు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సీఐ రాఘవరెడ్డి, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడిని పరిశీలించి , కుటుంబ సభ్యులను విచారించారు. ఈ మేరకు అనుమానస్పద స్థితి కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో వాస్తవాలు వెల్లడికావాల్సి ఉంది.

Tags: A person died in suspicious condition in Punganur

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *