నంద్యాల ముచ్చట్లు:
నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు నాయకులతో కలిసి వినూత్నంగా దున్నపోతుకు తమ డిమాండ్ పత్రాన్ని అందించి నిరసన తెలియజేశారు. 21
రోజులుగా తాము నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని అందుకే చలనం లేని ప్రభుత్వ తీరుకు నిరసనగా దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చామని ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లను
నెరవేర్చి అంగన్వాడీలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. గౌరవ వేతనం వద్దు కనీస వేతనం కావాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీలను గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో
మండల నాయకులు పద్మ ,శ్రీదేవి మరియు మండలంలోని అన్ని గ్రామాల కార్యకర్తలు వర్కర్లు పాల్గొన్నారు..
Tags: A plea for plowing